Ratan Tata Biopic: రతన్ టాటా బయోపిక్ కు రంగం సిద్ధం.. హీరో ఎవరంటే?
Sudha Kongara biopic on Ratan Tata: డాక్టర్ సుధ కొంగర ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు, ఆమె రతన్ టాటా జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Sudha Kongara to make the biopic on Ratan Tata: సూరారై పోట్రు అనే ఒక బయోపిక్ సినిమా తీసి నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ సుధ కొంగర ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళ నాడులో సూరారై పోట్రు పేరుతో రిలీజ్ అయిన సినిమాని తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ చేశారు.
ఇండియాలో ఒక ఎయిర్ లైన్స్ అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత కథనం ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆమె ఇండియన్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ లిస్ట్ రతన్ టాటా జీవిత కథనం ఆధారంగా చేసుకుని ఒక బయోపిక్ తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సూర్య లేదా అభిషేక్ బచ్చన్ రతన్ టాటాగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రస్తుతానికి ఆమె సూరారై పోట్రు హిందీ రీమేక్ సినిమా చేస్తున్నారు. దీంతో ఆమెకు హిందీ మార్కెట్ మీద కూడా కాస్త అవగాహన ఏర్పడింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రతన్ టాటా మీద ఉన్న క్రేజ్ ను ఆమె అర్థం చేసుకున్నారు.
దీంతో ఆయన మీద సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలుస్తోంది తెలుగులో ఆంధ్ర అందగాడు అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఆమె తర్వాత తమిళంలో ద్రోహి, ఇరుద్దు సూత్రు అనే సినిమాలు చేశారు.
ఇరుద్దు సూత్రు సూపర్ హిట్ కావడంతో దానినే ఆమె గురు అనే పేరుతో తెలుగులో వెంకటేష్ హీరోగా రూపొందించి రిలీజ్ చేసారు. అది తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం కొన్ని ఆంథోలాజి సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతానికి సూరారై పోట్రు హిందీ వెర్షన్ చేస్తున్నారు.
Also Read: Vishwak Sen : నక్కతోక తొక్కిన విశ్వక్ సేన్.. ఏకంగా 'సితార'తో సినిమా ఫిక్స్!
Also Read: Samantha No1: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా పాన్ ఇండియాలో నెం 1.. కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook