Samantha No1: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా పాన్ ఇండియాలో నెం 1.. కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!

Samantha No1 Pan Indian Heroine: గత కొన్నాళ్లుగా వార్తల్లోకి వస్తున్న సమంత ఇప్పుడు మరోమారు వార్తల్లోకి వచ్చింది, అయితే ఈసారి ఆమె పాన్ ఇండియా లెవల్లో టాప్ లేపి వార్తల్లోకి వచ్చింది, ఆమె పాన్ ఇండియన్ హీరోయిన్స్ లిస్టులో టాప్ ప్లేస్ సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 23, 2022, 07:06 AM IST
  • ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా సమంతే పాన్ ఇండియాలో నెం 1..
  • కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!
  • ఆర్మాక్స్ మీడియా అక్టోబరు లిస్టులో టాప్ ప్లేసులో సమంత
Samantha No1: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా పాన్ ఇండియాలో నెం 1.. కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!

Samantha Leads Pan India Heroines Race: ఈ మధ్యకాలంలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది అనే విషయాన్ని ఆర్ మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు పలు సర్వేలు నిర్వహిస్తూ ఒక రిపోర్ట్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్టోబర్ నెలకు గాను ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ పేరుతో ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్ ప్రచురించింది. 

ఈ లిస్టులో సమంత పాన్ ఇండియా లెవెల్ లో మొదటి స్థానం సంపాదించి తనకు తెలుగు భాషలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎవరు పోటీ లేరని నిరూపించుకుంది. ఆమె తరువాత రెండవ స్థానంలో అలియా భట్ నిలిచింది.

ఇక సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార మూడో స్థానానికి పరిమితం అయితే ఇటీవల ఒక బాబుకు జన్మనిచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కాజల్ అగర్వాల్ నాలుగో స్థానంలో నిలిచింది.

అలాగే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకొనే ఐదో స్థానానికి పరిమితం అయితే నేషనల్ క్రష్ రష్మిక ఆరో స్థానానికి మాత్రమే పరిమితమైంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడో స్థానానికి పరిమితమైతే ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా కూడా చేయని అనుష్క శెట్టి ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

ఇక మహానటి కీర్తి సురేష్ తొమ్మిదవ స్థానంలో నిలవగా పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో ఇటీవల సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన త్రిష పదవ స్థానాన్ని సంపాదించింది. ఇక కొన్నాళ్లుగా మొదటి స్థానంలోనే నిలబడుతూ వస్తూ ఉండటంతో ఆమె అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News