Sudigali Sudheer Gaalodu : సుధీర్ ప్రస్తుతం తన గాలోడు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సుధీర్ బుల్లితెరపై ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీల మీద స్పందించాడు. గాలోడు సినిమా రేపు విడుదల కాబోతోన్న తరుణంలో మీడియాతో ముచ్చటించాడు. ఈక్రమంలో జబర్దస్త్ కాంట్రవర్సీ, స్టార్ మాలోకి వెళ్లడం, మళ్లీ తిరిగి రావాడంపై ఇలా అనేక విషయాల మీద స్పందించాడు. అసలు జబర్దస్త్, మల్లెమాలను ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందనే విషయం మీద స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకున్న ఆర్ధిక కష్టాల వల్లే బయటకు వచ్చానని, రెమ్యూనరేషన్ పెంచాలని అడిగినట్టుగా సుధీర్ చెప్పుకొచ్చాడు. కానీ తుక్కుగూడలో మల్లెమాల మరో స్టూడియో కట్టడంతో బిజీగా ఉండటం, ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచలేమని చెప్పిందట. దీంతో తాను ఓ ఆరు నెలలు బయటకు వెళ్లి వస్తాను అని అన్నాడట. దానికి వారు సరేనని అన్నారట. అందుకే స్టార్ మాకు వచ్చాడట.


మళ్లీ ఆరు నెలలు అయ్యాక తిరిగి వస్తానని సుధీర్ చెప్పాడట. ఆ టైంకు డబ్బు చాలా అవసరం పడటంతో వెళ్లానని, ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు అయ్యాక మల్లెమాల వచ్చేందుకు సిద్దంగా ఉన్నానంటూ వారికి సమాచారం అందించాడట. కానీ ఇంకా ఏ విషయం బదులు రాలేదట. చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు సుధీర్.


ఏ షోలో ఖాళీగా ఉంటే ఆ షోను చేస్తాను..లేదంటే వారు ఆఫీస్ బాయ్‌గా కూడా ఖాళీగా ఉందని చెబితే.. అది కూడా చేస్తాను అని సుధీర్ నిర్మొహమాటంగా చెప్పాడు. ఇన్నేళ్లలో నాకు మల్లెమాల వల్ల ఎలా ఇబ్బంది కలగలేదని చెప్పాడు. మల్లెమాల మీద ఎవరికైనా ఇబ్బంది కలిగిందేమో తనకు తెలియదని చెప్పేశాడు. ఎవరి నిర్ణయం వారిది.. ఎవరైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకొచ్చవంటూ అనసూయ బయటకు వెళ్లడంపై పరోక్షంగా స్పందించాడు సుధీర్.


గాలోడు ట్రైలర్, టీజర్ చూసి చాలా మంది మెచ్చుకున్నారట.. ఇది అసలైనా సినిమాలా ఉందని, ఇప్పుడు అసలైన హీరోలా ఉన్నావని అంటున్నారట. మాస్ కమర్షియల్ అంశాలున్న ఈ చిత్రం కచ్చితంగా మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా సుధీర్ చెప్పుకొచ్చాడు.


Also Read : Neha Shetty Latest Pics : రాధిక.. పెట్టించావ్ కెవ్వు కేక.. డీజే టిల్లు హీరోయిన్ ఎద అందాల ప్రదర్శన


Also Read : Ram Charan RC 15 Workout Video : వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook