Ram Charan RC 15 Workout Video : వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్

Ram Charan RC 15 Workout Video రామ్ చరణ్‌ ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీకి చిత్రయూనిట్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా రామ్ చరణ్‌ ఇలా వర్కౌట్లు చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 12:48 PM IST
  • రామ్ చరణ్‌ RC 15 షూటింగ్ అప్డేట్
  • పది హేను కోట్లతో సాంగ్ షూటింగ్
  • వెకేషన్లో రామ్ చరణ్‌ వర్కౌట్లు
Ram Charan RC 15 Workout Video : వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్

Ram Charan RC 15 Workout Video : రామ్ చరణ్‌ ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియోను షేర్ చేశాడు. తన కొత్త సినిమా RC 15 కోసం విదేశాలకు వెళ్లినట్టు కనిపిస్తోంది. సాంగ్ షూటింగ్ కోసం రామ్ చరణ్‌, కియారా అద్వాణీ ఫారిన్‌కు చెక్కేసినట్టు తెలుస్తోంది. దాదాపు పదిహేను కోట్లతో ఈ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ అలా షూటింగ్ కోసం వెళ్లినా, గ్యాప్ దొరికినా, వెకేషన్లకు వెళ్లినా కూడా వర్కౌట్లకు మాత్రం డుమ్మా కొట్టేది లేదన్నట్టుగా చెబుతూ వీడియోను షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్‌ తన టీంతో కలిసి చేసిన అల్లరి, వర్కౌట్లు మామూలుగా వైరల్ అవ్వడం లేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్నీ ఈ మూవీ మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే పుణె, రాజమండ్రి, అమృత్ సర్, వైజాగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన షూటింగ్ అప్డేట్లు, అక్కడి నుంచి లీకైన రామ్ చరణ్‌ ఫోటోలు, వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే రాజమండ్రిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్‌లో భాగంగా సాంగ్ షూటింగ్ చేయబోతోన్నారట. ఈ సాంగ్ షూటింగ్ కోసం దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో శంకర్ మరోసారి తన కొత్త ప్రపంచంలోకి జనాలను తీసుకెళ్లేలా కనిపిస్తోంది. కానీ శంకర్ మాత్రం ఇప్పుడు రామ్ చరణ్‌ ప్రాజెక్ట్ మీద అంతగా ఫోకస్ పెట్టడం లేదని, కమల్ హాసన్ ఇండియన్ 2 మీద శ్రద్ద పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్‌ తదుపరి చిత్రం మీద కూడా రూమర్లు వస్తున్నాయి. శంకర్ మరోసారి రామ్ చరణ్‌, యశ్, రణ్‌ వీర్ సింగ్ వంటివారితో కలిసి ఓ నవలను మూడు పార్టులుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ రామ్ చరణ్‌ శంకర్‌తో చేసిన తరువాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

Also Read : Sankaranthi 2023 Movies : ఓవర్సీస్ మార్కెట్లో దారుణంగా బాలయ్య.. ఆ హీరోల ముందు చిరు కూడా చిత్తేనా?

Also Read : Pradeep Ranganathan Facebook : డైరెక్టర్ కమ్ హీరోకి చిక్కులు.. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్?.. వెంటాడుతున్న పోస్ట్‌లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News