Extra Jabardasth Latest Promo: తాము ‘జబర్దస్‌’ షోను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సుడిగాలి సుధీర్ టీమ్ ప్రకటించింది. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో ప్రత్యేక స్కిట్ చేసిన ఈ టీమ్.. ముగింపులో తమ నిర్ణయాన్ని ప్రేక్షకులకు తెలియజేశారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కలిసి జబర్దస్త్ స్టేజ్ పై ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ద్వారా ఈ విషయం తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ లో వచ్చే వారం ప్రసారం కానున్న షో లో ‘సుధీర్‌ స్పెషల్‌ స్కిట్’ పేరుతో ఈ టీమ్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు! ‘జబర్దస్త్‌’ ఫేం రాఘవ ఫ్యామిలీ, ఆదితో వీరు చేసిన అల్లరి చూస్తే నవ్వుల సాగరంలో మునిగిపోవాల్సిందే. ఈ క్రమంలో రాఘవ కొడుకు సుధీర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. పంచ్‌ మీద పంచ్‌ విసిరి కితకితలు పెట్టాడు. ఈ ప్రదర్శన పూర్తయ్యాక సుడిగాలి సుధీర్‌ టీమ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.


“మేం ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. కానీ, ఈ వేదికపై చెప్పాల్సి వస్తుంది. ఇకపై జబర్దస్త్‌ నుంచి మేం వెళ్లిపోవాలనుకుంటున్నాం!! మమ్మల్ని క్షమించండి. ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు” అని సుడిగాలి సుధీర్ టీమ్ పేర్కొంది.


సుడిగాలి సుధీర్.. హోస్ట్‌గా, కమెడియన్‌గా చాలా ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనతో ఎప్పుడూ ఉండే శ్రీను, రామ్ ప్రసాద్. వీరు ముగ్గురు కలిసి చేసే కామెడీ స్కిట్స్‌కు చాలానే క్రేజ్ ఉంది. వీరి టీమ్‌కు అభిమానులు కూడా ఎక్కువే. జబర్దస్త్ షో పాపులర్ అయిన తర్వాత ఈ ముగ్గురికి వెండితెర అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. అందుకే వీరి జబర్దస్త్ గురించి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.


Also Read: ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?


Also Read: RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌కు కుదిరిన ముహూర్తం.. ఎన్టీఆర్ వీడియో విడుద‌ల‌!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook