Prasanna Vadanam Collections: ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోగా మారడం కంటే.. హీరోగా నిలదొక్కుకోవడం కష్టమైన విషయం అయిపోయింది. ఒకటి..రెండు మంచి సినిమాలు చేసినా కూడా ఆ తర్వాత మళ్లీ.. స్క్రిప్ట్ సెలక్షన్ లేదా ఇతరత్రా కారణాలవల్ల సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యంగ్ హీరో సుహాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కలర్ ఫోటో వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్.. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో కూడా బాగానే మెప్పించాడు. సినిమా కలెక్షన్ కూడా మంచిగానే వచ్చాయి. వెంటనే హిట్2లో విలన్ పాత్రలో కనిపించి నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు.


ఇక ఆ స్పీడ్ తోనే నాలుగు నెలల్లో.. మూడు సినిమాలతో వచ్చేసాడు. చెప్పుకోడానికి ఇది చాలా మంచి నంబర్ కానీ అందులో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ మధ్య సూహాస్ హీరోగా విడుదలైన ప్రసన్న వదనం సినిమా మంచి టాక్ అయితే అందుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం అంతంతగా మాత్రమే ఉండిపోయాయి.


దీనికంటే ముందు వచ్చిన శ్రీరంగనీతులు సినిమా గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం సినిమా వచ్చివెళ్ళిపోయింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సినిమాలో సుహాస్ సోలో హీరో కాకపోయినా సుహాస్ మీదే హైలైట్ చేసి ప్రమోషన్లు జరిగాయి.  అంతకంటే ముందు విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా మంచి టాక్ అయితే అందుకుంది.. కానీ బ్లాక్ బస్టర్ కాలేదు.


అయితే కనీసం ఈ మూడు సినిమాల ఫలితాలు చూసి ఆయన సుహాస్ తన స్పీడ్ తగ్గించి సినిమా కథ, బడ్జెట్ మీద దృష్టి పెట్టాలని కొందరు సినీ పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన ఈ హీరో సినిమాలలో ప్రొడక్షన్ క్వాలిటీ బాగుండటం లేదు అని టాప్ నడిచింది. కాబట్టి ఈ హీరో ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోతో పోల్చుకోవడంలో తప్పులేదు కానీ అక్కడిదాకా చేరుకోవడం కోసం సుహాస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. కనీసం మీడియం రేంజ్ హీరోలాగా మినిమం గ్యారంటీ స్టేజ్ కైనా రావాలి. మరి ఇప్పటికైనా సుహాస్ సినిమాల నెంబర్ కన్నా సినిమా క్వాలిటీ పైన దృష్టి పెడతాడో లేదో చూడాలి.


Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter