Uttar pradesh teen collapses while dancing at sister haldi function: పెళ్లి వేడుక జీవితంలో ఒకేసారి జరుగుతుంది. అందుకు యువత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకొవడానికి ఉత్సాహాం చూపిస్తారు. డబ్బులుఎంతైన అస్సలు పట్టించుకోరు. ప్రతి వేడుక కూడా కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ లు చేస్తారు. వెడ్డింగ్ ఆర్గనైజర్లను సంప్రదిస్తుంటారు. ఎండ డబ్బులు అడిగిన ఇచ్చేస్తుంటారు. పెళ్లికి సంబందించిన ప్రతి వేడుక.. హల్దీ, మెహందీ, సంగీత్ లు, పెళ్లి వేడుకలు ఇలా అన్ని గ్రాండ్ గా నిర్వహించుకునేలా పక్కా ప్లాన్ లు చేసుకుంటారు. కానీ కొందరు పెళ్లిళ్లలో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. మరీ కావాలని చేస్తారో.. పబ్లిసిటీ కోసం చేస్తారో ఆ పెళ్లిళ్లు వార్తలలో ఉంటాయి. కొందరు పెళ్లిళ్లలో మాజీ లవర్ లు సడెన్ గా పెళ్లిలో ఎంట్రీ ఇస్తుంటారు. బట్టతల ఉందని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటారు. వరుడు మండపంకు తాగి రావడం వల్ల వధువు పెళ్లి వద్దనుకుంటుంది. కొన్నిసార్లు మండపంలోనే యువతీ యువకులు కొట్టుకోవడం కూడా చేస్తుంటారు. మరికొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో విషారకర ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఉత్సాహాంగా డ్యాన్స్ లు చేస్తున్నప్పుడు కొందరు కింద పడి చనిపోతుంటారు.పెళ్లిలో అనుకోని ఘటలను జరిగి మధ్యలోనే పెళ్లి ఆగిపోతుంది. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
UP : मेरठ में बहन के हल्दी प्रोग्राम में डांस कर रही रिमशा नामक युवती की मौत हुई। डॉक्टर इसे हार्ट अटैक बता रहे हैं। pic.twitter.com/FXa2cIzEh4
— Sachin Gupta (@SachinGuptaUP) April 28, 2024
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.. మీరట్ జిల్లాకు చెందిన ఓ యువతి గుండెపోటుతో మరణించిన ఘటన పెను సంచలనంగా మారింది. సదరు యువతి తన కజిన్ సోదరి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఫుల్ జోష్ గా స్టెప్పులు వేస్తుంది.ఆమె చుట్టుపక్కల పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ, ముచ్చటిస్తూ, అకస్మాత్తుగా ఒక పిల్లవాడి చేతిని పట్టుకోవడం ఆపి, వెంటనే నేలపై పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించారు. కానీ ఆమెనుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో ఆమెను బంధువులు హుటా హుటీన ఆసుపత్రికి తీసుకెళ్లారు.
యువతిని టెస్టు చేసిన వైద్యులు గుండెపోటు రావడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబీకులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కూడా క్యాన్షిల్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల అనేక మంది డ్యాన్సులు చేస్తు కుప్పకూలీపడిపోయిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ మంది గుండెపోటుకు గురౌతున్నారు.
ఇటీవల రాజస్థాన్ లోని ఇటీవల పెళ్లి వేడుకలో కూడా విషాదం చోటుచేసుకుంది. జుంజును జిల్లాలోని నవాల్ ఘర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ లో పెళ్లి వేడుక సందర్భంలో.. తలపై కుండను పెట్టుకుని మట్కా డ్యాన్స్ చేస్తుంటారు. తన మేనల్లుడి పెళ్లికి కూడా.. కమలేష్ కూడా ట్రెండిషనల్ గా కుండతలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు.ఇంతలో అందరు చూస్తుండగానే కింద పడి చనిపోయాడు. ఇక్కడ కూడా గుండెపోటుతోనే సదరు వ్యక్తి చనిపొయినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter