Suhas Writer Padmabhushan : మహిళలకు ఉచితంగా సినిమా.. `రైటర్` కోసం కొత్త ప్రమోషన్స్
Free Show To Women రైటర్ పద్మభూషణ్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఉచితంగా ప్రదర్శించబోతోన్నారు. 38 థియేటర్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందట. మహిళలు ఎవరైనా సరే సినిమాను ఫ్రీగా చూడొచ్చట.
Suhas Writer Padmabhushan సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలు, మౌత్ టాక్ ఇలా అన్నీ బాగుండటంతో సినిమాకు కలెక్షన్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాగానే దుమ్ములేపేస్తోంది. అయితే ఇప్పుడు రైటర్ కోసం వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
రైటర్ పద్మభూషణ్ సినిమాలో క్లైమాక్స్, అమ్మ ప్రేమను చూపించిన తీరుకు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెట్ట్ అవుతారు. అందుకే ఈ సినిమాను ఎక్కువగా ఫ్యామిలీ, మహిళలు చూస్తున్నారు. ఈ కారణంగానే రైటర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాను మహిళలందరికీ ఉచితంగా చూయించేందుకు రెడీ అయ్యారు.
రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 38 థియేటర్లలో ఈ సినిమాను మహిళల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్నారట. ఈ మేరకు టికెట్‌ను సుమ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఉమెన్స్ వెడ్ నెస్ డే అంటూ స్పెషల్ టికెట్‌ను సుమ లాంచ్ చేసింది. ఈ టికెట్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని సుమ చెప్పుకొచ్చింది.
ఆడవారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని కూడా గౌరవించాలి అనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అందుకే మహిళలకు ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి.. వారికి ఫ్రీగా సినిమాను చూపించేందుకు చిత్రయూనిట్ ముందుకు వచ్చింది. అన్ని ఏరియాల్లోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లో ఈ సినిమాను మహిళలకు ఉచితంగా ప్రదర్శించబోతోన్నారు.
సుహాస్‌కి మాత్రం ఈ సినిమా బాగానే కలిసి వచ్చింది. మహేష్ బాబు లాంటి వాడు కూడా సినిమాను చూసి సుహాస్ నటనను మెచ్చుకున్నాడు. తాజాగా రవితేజ కూడా ఈ సినిమా మీద ట్వీట్ వేశాడు. రైటర్ పద్మభూషణ్ కమర్షియల్‌గానూ సక్సెస్ అవుతోంది.
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook