Ram Charan rc 16 ప్రాజెక్ట్ మీద గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే. చివరకు అవే నిజమయ్యాయి. రూమర్లకు తగ్గట్టుగానే రామ్ చరణ్‌ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఈ ఇప్పుడు rc 16 మీద మరో వార్త వైరల్ అవుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్ అంటూ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్‌గా వివేక్ అగ్నిహోత్రిలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇప్పుడు సుకుమార్, అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్‌గా వివేక్ అగ్నిహోత్రిలు ఒక్క చోటకు చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్ కోసం అదిరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేశారట, అది ప్యాన్ ఇండియన్ మూవీగా రాబోతోందట.. ఇండియన్ మూవీ ఫేస్‌ను చేంజ్ చేసేలా ఉంటుందని టాక్ వస్తోంది. సుకుమార్, అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్‌గా వివేక్ అగ్నిహోత్రిలు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీన్ని శివ చెర్రీ ట్వీట్ చేయడంతో.. అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. శివ చెర్రీ ట్యాగ్ పోస్ట్ చేశాడంటే అది కచ్చితంగా రామ్ చరణ్ సినిమానే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.


అసలే ఇప్పుడు రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే డిప్రెషన్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అదే సమయంలో రామ్ చరణ్‌ సుకుమార్ సినిమాకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్‌, యాక్షన్ సీక్వెన్స్‌ డీటైల్స్ బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా సుకుమార్, అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్‌గా వివేక్ అగ్నిహోత్రిలు కలిసి కనిపించడంతో ఆ ప్రాజెక్ట్ మీద మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే వీటి వెనుకున్న అసలు కథ ఏంటి? ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


 



మన దేశంలోని జీనియస్ డైరెక్టర్లిద్దరినీ ఇలా కలవడం చూసి ఆనందంగా, గర్వంగా ఉంది.. ఈ ఇద్దరూ కలిసి ఎవ్వరూ ఊహించనటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు.. ఇలాంటిది ఇండియన్ సినిమా ఎప్పుడూ చూసి ఉండదు అంటూ అభిషేక్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


Also Read : Bigg Boss 6 : శ్రీహాన్ మీదకు ఎక్కేసిన శ్రీసత్య.. పాపం అర్జున్ బక్రా అయ్యాడుగా.. అప్పుడలా ఇప్పుడిలా


Also Read : Jabardasth Varsha : బొప్పాయి తోటలో జబర్దస్త్ పాప.. పిచ్చెక్కిస్తోన్న వర్ష పోజులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook