Sukumar Daughter Sukruthi bandreddi సుకుమార్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ ఆయన భార్య తబిత మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సుకుమార్ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ ట్రిప్స్, సుకుమార్ గురించి ఏ విషయం తెలియాలన్నా కూడా తబితను ఫాలో అవ్వాల్సిందే. సుకుమార్ తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడు అనే విషయం ఆమె ఇన్ స్టాగ్రాం ఖాతాను ఫాలో అయితే తెలుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సుకుమార్ అంటే తబితకు ఎంత ఇష్టమన్నది ఆమె వేసే సుధీర్ఘమైన పోస్టులు, అందులో రాసే రాతలు, పొయెటిక్‌గా చెప్పే మాటలు చూస్తే అర్థమవుతుంది. సుకుమార్ సినిమాలు, అందులో రాసే డైలాగ్స్‌లో ఎంత ఎమోషన్ ఉంటుందో.. తబిత పోస్టుల్లో అంతే ఎమోషన్ ఉంటుంది. ఆ మధ్య పుష్ప సక్సెస్ ఈవెంట్‌లో తన భార్య గురించి చెబుతూ సుకుమార్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.


అలా తన భర్త తన పేరుని అంత పెద్ద స్టేజ్ మీద చెప్పడంతో తబిత మురిసిపోయింది. తన భర్త పడే కష్టం గురించి చెబుతూ పెద్ద స్టోరీని పోస్ట్ చేసింది. అందులో సుకుమార్ మీదున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాజాగా సుకుమార్ భార్య వేసిన పోస్ట్, అందులో తమ బిడ్డ గురించి చెబుతూ అన్న మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.


 



యుక్త వయసులోకి వచ్చేశావ్.. పెద్దదానివి అవుతున్నావ్.. ఆల్రెడీ నువ్ మానసికంగా ఎంతో ఎదిగావ్.. మాకే అన్నీ నేర్పిస్తున్నావ్.. ఓ మంచి తల్లి ఎలా ఉండాలో నువ్ నాకు నేర్పిస్తున్నావ్.. నువ్ నాకు ఎప్పుడూ ఎన్నో గొప్ప విషయాలు చెబుతున్నావ్.. నీ మీద నాకున్న ప్రేమను చెప్పేందుకు లక్షల పదాలు సరిపోవు.. ఓ చిన్న హగ్ మాత్రం సరిపోతుంది.. నీ దగ్గరి నుంచి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే స్వీట్ హార్ట్.. మిస్ టీనేజర్ అంటూ కూతురి మీద ప్రేమను కురిపించింది.


Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన


Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి