Sukumar Writings Entered in Pushpa the Rule Production Replacing Mutthamsetty Media Works: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సుకుమార్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ పేరిట విడుదలైన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ మీద భారీ అంచనాలు కూడా ప్రేక్షకులలో ఏర్పడ్డాయి. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి, అనేక పుకార్లు కూడా పుట్టుకు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఎట్టకేలకు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడే ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమాను ప్రారంభించారు మేకర్స్. అయితే ఈ సినిమా నిర్మాతల విషయంలో మాత్రం ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. అదేమిటంటే పుష్ప సినిమా మొదటి భాగాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ -మొత్తం శెట్టి మీడియా అనే మరో సంస్థతో కలిసి నిర్మించింది. ఆ మొత్తం శెట్టి మీడియా సంస్థ మరెవరితో కాదు అల్లు అర్జున్ కు మేనమామ కుమారుడిదే. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని కూడా వారు సహనిర్మాతులుగా వ్యవహరిస్తారని భావించారు.


కానీ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ ఇప్పుడు పుష్ప రెండో భాగం నిర్మాణం భాగస్వామి బాధ్యతల నుంచి తప్పుకుంది. అదే స్థానంలోకి సుకుమార్ రైటింగ్స్ అంటే సుకుమార్ కి సంబంధించిన నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. మొత్తం శెట్టి మీడియా వర్క్స్ అనేది అల్లు అర్జున్ మేనమామ కుమారుడు విరాన్ మొత్తం శెట్టి మేనేజ్ చేసేవారు. ఆయన బతుకు బస్టాండ్ అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు.


బహుశా ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారా? లేక సుకుమార్ పట్టు పట్టడంతో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కి ఆ బాధ్యతలు అప్పగించాల్సి రావడంతో మొత్తం శెట్టి మీడియా వర్క్స్ ను తప్పించారా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక విరాన్ మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ కి అనధికార మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉండేవారనే సంగతి సినీ పరిశ్రమలో దాదాపు అందరికీ తెలిసిందే. 
Also Read: Liger Movie Pre Release Business: షాకిచ్చేలా లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ కెరీర్ హయ్యెస్ట్!


Also Read: Ananya Nagalla Surgery: అక్కడ సర్జరీ చేయించుకున్న అనన్య.. మొదటికే మోసం రావడంతో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి