Liger Movie Pre Release Business: షాకిచ్చేలా లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ కెరీర్ హయ్యెస్ట్!

Liger Movie Total Pre Release Business Details: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం లైగర్ కి దిమ్మతిరిగేలా బిజినెస్ జరిగింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 03:56 PM IST
Liger Movie Pre Release Business: షాకిచ్చేలా లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ కెరీర్ హయ్యెస్ట్!

Liger Movie Total Pre Release Business Details: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.  

ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరీ జగన్నాథ్, చార్మి కౌర్  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ-మైక్ టైసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది. టైర్ 2 హీరోలలో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాకి టైర్ 1 హీరోలకు జరిగినట్లుగానే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి నైజాం ప్రాంతంలో పాతిక కోట్ల రూపాయలకు హక్కుల అమ్ముడయ్యాయి.

సీడెడ్ ప్రాంతంలో 9 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏడున్నర కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లా ఐదు కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లా 3.8 కోట్లు, గుంటూరు 5.2 కోట్లు కృష్ణ 4.3 కోట్లు నెల్లూరు 2.3 లక్షలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో 62 కోట్లకు బిజినెస్ జరిగింది. కర్ణాటక 5. 20 లక్షలు, తమిళనాడు 2. 5 కోట్లు, కేరళ 1. 15 లక్షలు బిజినెస్ జరగగా ఓవర్సీస్ లో 7.5 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది.

ఇక నార్త్ ఇండియాలో కేవలం 10 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల 40  లక్షల బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 88.40 లక్షలకు జరగడంతో ఈ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లో జరిగిన టాప్ 20 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లలో ఒకటిగా నిలిచింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. 

Also Read: Ananya Nagalla Surgery: అక్కడ సర్జరీ చేయించుకున్న అనన్య.. మొదటికే మోసం రావడంతో!

Also Read: Allu Arjun at India Day parade: అమెరికాలోనూ తగ్గేదేలే అనిపించిన అల్లు అర్జున్.. మామూలు క్రేజ్ కాదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News