OTT Movies This Month: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. వివిధ ఓటీటీ వేదికలపై సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓటీటీల ప్రాముఖ్యత, ప్రాధాన్యత బాగా పెరిగింది. థియేటర్‌లో చూడటం కంటే సినిమాను ఓటీటీల్లో చూసేందుకే ఇష్టపడుతున్నారు. అందుకే చిత్ర నిర్మాతలు కూడా ఓటీటీల్లో సినిమా విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా త్వరగానే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.


ప్రస్తుతం వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ఓటీటీల్లో టీవీషోలతో పాటు సూపర్ హిట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ నెలలో వివిధ ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు పరిశీలిద్దాం.


ఇటీవల విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మే 13వ తేదీన హిందీ, తమిళ, తెలుగు, కన్నడతో సహా ఇతర భారతీయ భాషళ్లో విడుదల కానుంది. మోడర్న లవ్ ముంబాయి వెబ్‌సిరీస్ అమెడాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక సూపర్ డూపర్ హిట్ హలీవుడ్ సీక్వెల్ మూవీ మ్యాట్రిక్స్ 4..అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఇక ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులతో సంచలనం రేపుతున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కూడా  ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్, జీ5లలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ తళపతి విజయ్ , పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నెట్‌‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. 


ఇక మరో బాలీవుడ్ మూవీ ఆదా ఇష్క్ వూట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తల్లీకూతుర్లు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటమనే విభిన్నమైన రొమాంటిక్ సినిమా ఇది. ఇక మమ్ముట్టి, పార్వతి తిరువోతు నటించిన మళయాళం సినిమా పుఝు సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 


Also read: Allu Arjun Gift: అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్... మురిసిపోయిన నవదీప్... థ్యాంక్స్ బావ అంటూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.