Sun Pictures Shock to Pooja Hegde : ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే ఆమెకు తమిళ నిర్మాతలు షాక్ ఇచ్చారని తాజాగా ప్రచారం మొదలైంది. గతంలో పూజ హెగ్డే విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్  సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థనే ఇప్పుడు పూజా హెగ్డేకు షాకిచ్చిందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో పూజా హెగ్డే చేసిన కొన్ని అనవసర ఖర్చులు విషయంలో ఆమెకు షాక్ తగిలిందట.
 
నిజానికి పూజా హెగ్డే దక్షిణాదికి చెందిన అమ్మాయి అయినా సరే ఆమె తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. కాబట్టి ఆమె కూడా నివాసం ముంబైలో ఉంటున్నారు. ఆమె కనుక చెన్నై లేదా హైదరాబాద్ షూటింగ్ కోసం రావాలి అంటే ఆమెతో పాటు సుమారు పది పన్నెండు మంది పర్సనల్ స్టాఫ్ కూడా షూటింగ్ కోసం రావాల్సి ఉంటుంది. పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా ఆమె నిర్మాణ సంస్థ చేత పెట్టిస్తున్నారని గతంలో ఆర్కే రోజా భర్త సెల్వమణి,  తెలుగు నిర్మాత నట్టికుమార్ వంటి వాళ్లు ఆరోపించారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయించారనే విషయం చేసుకున్న సన్ పిక్చర్స్ సంస్థ ఆమె కమిట్ మెంట్ ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఖర్చు చేయించారనే లెక్కలు పూర్తిగా బయటకు తీసిందని టాక్. ఆ లెక్కలు అన్నీ బయటకు తీసి వాటన్నింటికి సంబంధించిన బిల్స్ ఆమెకు పంపించారట. మనం అనుకున్న దనికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన అమౌంట్ తిరిగి కట్టాలి అంటూ వారు పూజ హెగ్డేకి సున్నితంగా చెప్పారని తెలుస్తోంది. కచ్చితంగా డబ్బు కట్టాల్సిందేనని కట్టనంటే కుదరదంటూ వారు పేర్కొనడంతో ఇప్పుడు ఆ డబ్బు కట్టేందుకు పూజా హెగ్డే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
అయితే తాను స్టార్ హీరోయిన్ గా ఉన్నాను కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త అటూ ఇటుగా చూసి వదిలేస్తారని భావించిందట పూజా హెగ్డే. అందుకే ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా తన పర్సనల్ స్టాప్ మొత్తాన్ని తీసుకుని వచ్చేదట. కానీ అనుకున్న దాని ప్రకారం మాత్రమే మేము డబ్బులు చెల్లించాలని,  కానీ మీరు పెట్టిన వృధా ఖర్చు కూడా ఇప్పుడు చెల్లించాము కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరడంతో ఆమె ఈ విషయంలో సైలెంట్ అయిందని తెలుస్తోంది.
Also Read: VirataParvam Day 2 Collections: మరింత డ్రాప్.. ఆ ఎఫెక్ట్ ఏనా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also  Read: Thalapathy Vijay : ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన పరోటా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook