రివ్యూ:'సుందరం మాస్టర్'
నటీనటులు: వైవా హర్ష, దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠాపురం,  తదితరులు..
సినిమాటోగ్రఫీ: దీపక్ యంటలా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: కార్తీక్
నిర్మాత: రవితేజ,సుధీర్ కుమార్  కుర్రా
కథ, దర్శకుడు: కళ్యాణ్‌ సంతోష్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sundaram Master Movie Review: వైవా హర్ష... మంచి కామెడీ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. మొదట్లో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు. చాలా సినిమాల్లో తన హస్యంతో అలరించిన హర్ష... ఇప్పుడు లీడ్ రోల్ పోషించి... తనే హీరోగా నటించిన చిత్రం 'సుందరం మాస్టర్'. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసారు మేకర్స్. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..


సుందరం మాస్టర్ (వైవా హర్ష) ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం (సోషల్ సబ్జెక్ట్) పాఠాలు చెప్పే టీచర్ గా పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉంటుంది. ఈ సందర్బంగా  ఆ ఏరియా ఎమ్మెల్యే(కమెడియన్ హర్ష వర్ధన్) పాఠశాలకు వచ్చి... అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరినీ పరిశీలించి... సుందరం మాస్టర్ ని ఓ పని కోసం ఎంచుకుంటారు. అదేంటంటే... బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గత 90 ఏళ్లుగా మిరియాల మెట్ట అనే ఓ ఊరు ఉంది. ఆ ఊళ్లోకి బయటి వాళ్లకి ప్రవేశం ఉండదు. మొదటిసారి వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారు అంటూ... ఆ ఊర్లో ఏదో విలువైనది ఉంది... దాన్ని కనుక్కోవడానికి నిన్ను పంపుతున్నాము. ఆరు నెలల్లో దానిని కనిపెడితే నీకు డీయీవో ప్రమోషన్ వస్తుందని ఆశ చూపుతాడు ఎమ్మెల్యే. దాంతో అసలే కట్నం మీద అత్యాశతో వున్న సుందరం మాస్టర్... డీయీవో అయితే మరింత ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడి ఆ ఊరికి వెళ్లడానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో సుందరం మాస్టర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరకున్న పనిని దిగ్విజయంగా పూర్తి  చేసాడా ? లేదా అనేదే 'సుందరం మాస్టర్' స్టోరీ.



కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


దర్శకుడు తాన ఎంచుకున్న స్టోరీ... అందకు తగ్గ కథనం వైవిధ్యంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ఉన్న కథలు మనం చూసుండం. మనం నిత్యం ఏదో ఒక సందర్భంలో ఇంకా కొన్ని మారుమూలన ఉండే కుగ్రామాల గురించి... కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి రియల్ లైఫ్ లో కూడా నిత్యం పత్రికల్లో చదువుతూనే ఉంటాం. అలాగే మిరియాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ పాత్రని రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచాడు.
సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం.. లాంటి ఎమోషన్స్ తో  ఈ సినిమాను పరుగులు పెట్టించాడు.


ఆ ఊరి వాళ్లకి దేశానికి స్వతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారు అని తెలియకపోవడం, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవడాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించాడు. క్రికెట్, ఇప్పుడు ఉన్న డబ్బుల గురించి తెలియకపోవడం, గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే... ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం.. లాంటి సీన్స్ ఫన్నీగా అనిపించడంతో పాటు ఆలోచింపచేస్తాయి. అయితే ఇవే సీన్స్ లో కొన్ని మాత్రం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో వాడుకొని కథ చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓవరాల్ గా మొదటి హాఫ్ హాస్యంతోనూ... సెకెండాఫ్ ని కొంత ఫిలాసఫీతోనూ నడిపించారు ‘సుందరం మాస్టర్’. ఇలాంటి కొత్త జోనర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులను సుందరం మాస్టర్ కచ్చితంగా అలరిస్తోంది.


దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం వెరైటీ సాగిపోతూ ఉంటుంది. ఈ తరహా సినిమాలకు ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారో... వారిని టార్గెట్ చేసి తీసిన మూవీ ఇది. కామెడీతో పాటు కొంచెం ఫిలాసఫీని మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ అయ్యేలా చేసాడు.  అలాగే ఈ సినిమాని సాంకేతికంగా కూడా చాలా ఉన్నతంగా నిర్మించారు. ముఖ్యంగా సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. అడవులు, జలపాతం, మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న ఊరు.. ఇవన్నీ సినిమాటిక్ విజువల్స్ లో అద్భుతంగా చూపించడంతో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం కనిపిస్తోంది.  నిజంగా ప్రపంచానికి దూరంగా ఓ పల్లెటూరు ఉంటె అలాగే ఉంటుందేమో అనిపించేలా సెట్స్ వేశారు. కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి . నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.


నటీనటుల విషయానికొస్తే..


షార్ట్ ఫిలింస్ లోనూ, సిల్వర్ స్క్రీన్ పై తనదైన కామెడీతో ఇన్నాళ్లు అలరించిన  వైవా హర్ష...  ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సుందర్ మాస్టర్ లో తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్‌లో మరే ఇతర నటుడిని ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి.  అతనికి జోడీగా నటించిన దివ్య శ్రీపాద... ఆ ఊర్లో ఓ అనాథ పిల్లగా నటించి తన పాత్రకు న్యాయం చేసింది. గ్రామ పెద్దగా బాలకృష్ణ నీలకంఠాపురం, ఎమ్మెల్యేగా కమెడియన్ హర్షవర్దన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


ప్లస్ పాయింట్స్


వెరైటీ సబ్జెక్ట్


వైవా హర్ష యాక్టింగ్


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


లాజిక్‌కు అందని సన్నివేశాలు


కమర్షియల్ వాల్యూస్  


పవర్ పంచ్.. నవ్వించే సుందరం మాస్టర్..
 


రేటింగ్: 2.75/3


ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి


ఇదీ చదవండి: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి