School Holidays: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

School Holidays:  తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 23, 2024, 07:52 AM IST
School Holidays: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

School Holidays:  తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

అయితే, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నేడు ఉమ్మడి వరంగాల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం విద్యాసంస్థలకు మాత్రమే ఉంటుందని కలెక్టర్ల కార్యాలయాలు పేర్కొన్నారు. కానీ, ములుగు జిల్లావ్యాప్తంగా మాత్రం విద్యాసంస్థలతోపాటు అన్నీ కార్యాలయాలు బంద్ పాటించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. రేపటి నుంచి అంటే 2024  ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Sammakka-Saralamma: మేడారం జాతరలో మహా విషాదం.. ఒకే రోజు ఇద్దరు భక్తుల మృతి..

అయితే, జాతరకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ 6వేల బస్సులు ఏర్పాటు తేసింది. ఇదిలా ఉండగా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తీపిగబురు ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు రైళ్లు నడపడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరీ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

ఇదీ చదవండి: Medaram: సమ్మక్క సారక్క జాతరలో పోలీస్‌ అత్యుత్సాహం.. భార్యాభర్తలపై చేయి చేసుకున్న వైనం

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ – సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు:  07017/07018
వరంగల్ – సికింద్రాబాద్ – వరంగల్ రైళ్లు :07014/07015
నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్: 07019/0720

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News