Sunny Leone Birthday: సన్నీ లియోనీ బర్త్ డే స్పెషల్.. సన్నీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు!
Sunny Leone Birthday: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీకి భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె నటనకే కాకుండా సన్నీ చేసే సేవా కార్యక్రమాలకు వాళ్లు ఆకర్షితులయ్యారు. నేడు (మే 13) సన్నీ లియోనీ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి తెలియని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
Sunny Leone Birthday: బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన తొలి నటిగా సన్నీ లియోనీ నిలిచింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. బోల్డ్ బ్యూటీగానే కాకుండా ఆమె చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలకు సన్నీ లియోనీని చాలా మంది అభిమానిస్తారు. నేడు (మే 13) ఆమె పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ సన్నీ లియోనీ గురించి తెలియని 10 విషయాలను తెలుసుకుందాం.
సన్నీ లియోనీ గురించి ఎవ్వరికీ తెలియని వాస్తవాలు..
1. సన్నీ లియోనీ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ వోహ్రా. కెనడాలోని అంటారియోలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది.
2. ఆమె చదువుకునే రోజుల్లో నర్సుగా పనిచేసేప్పుడు ఆమెను అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరుకు ఆమె లియోనీ జత చేసుకుంది. ఫైనల్ గా ఆమెకు సన్నీ లియోనీ పేరు అలా వచ్చింది.
3. సన్నీ లియోనీ భోజన ప్రియులు. ఆమెకు ఇష్టమైన సమోషాలు, పానీ పూరీ, దహీ చాట్ వంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. ఆమెకు చాక్లెట్స్ అంటే కూడా చాలా ఇష్టమట.
4. 2016లో BBC విడుదల చేసిన అత్యంత ప్రభావంతమైన మహిళల జాబితాలో సన్నీ లియోనీ పేరు కూడా ఉంది.
5. కాన్సర్ నిర్మూలక కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఆమె సహకారాన్ని అందిస్తుంది. దీంతో పాటు జంతు హక్కుల మద్దతురాలిగానూ వ్యవహరించింది.
6. 16 సంవత్సరాల వయస్సులో శృంగారానికి ఆకర్షితురాలైంది.
7. 2016లో తన సొంత మొబైల్ యాప్‌ని ప్రారంభించిన తొలి భారతీయ సెలబ్రిటీగా సన్నీ నిలిచింది.
8. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రనిర్మాత డేనియల్ వెబర్ ను ఆమె ప్రేమించి పెళ్లాడింది.
9. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత దిలీప్ మెహతా సన్నీ లియోనీపై ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అది 2016లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అయితే ఈ డాక్యుమెంటరీని భారత్ లో విడుదల చేసేందుకు మాత్రం సన్నీ ఇష్టం లేదట.
10. సన్నీకి ఇష్టమైన బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, అమీర్ ఖాన్, సోనమ్ కపూర్, రణవీర్ సింగ్.
Also Read: RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!
Also Read: Kangana Ranaut Marriage: నాకు పెళ్లి అవ్వకపోవడానికి కారణం అదే!: కంగనా రనౌత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.