Kangana Ranaut Marriage: నాకు పెళ్లి అవ్వకపోవడానికి కారణం అదే!: కంగనా రనౌత్

Kangana Ranaut Marriage: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వివాహం గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు. ఇటీవలే విలేకర్ల సమావేశంలో అడిగిన ప్రశ్నకు.. తనపై వచ్చే రూమర్ల వల్లే తనకు ఇంకా పెళ్లి కాలేదని సమాధానమిచ్చింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 01:00 PM IST
Kangana Ranaut Marriage: నాకు పెళ్లి అవ్వకపోవడానికి కారణం అదే!: కంగనా రనౌత్

Kangana Ranaut Marriage: బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె పెళ్లి గురించి ఇటీవలే హిందీ చిత్రసీమలో కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆమె షాకింగ్ రిప్లే ఇచ్చింది. తనపై వస్తోన్న పుకార్ల వల్లే తనకు ఇంకా పెళ్లి కాలేదని బాంబు పేల్చింది. 

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధకడ్' సినిమా మే 20న విడుదల కానుంది.  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో ఇందులో కంగన.. ఏజెంట్ అగ్ని పాత్రలో నటించారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె.. అందులో భాగంగా విలేకర్లు అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చింది. 

సినిమాలో మాదిరిగా నిజజీవితంలోనూ మీరు అబ్బాయిలు కొడతారట? అని అడిగిన ప్రశ్నకు కంగనా రనౌత్ స్పందించారు. "అందులో నిజం లేదు. నిజజీవితంలో నేను ఎవర్ని కొడతాను? పురుషులపై నేను చేయిచేసుకుంటాననే రూమర్ల వల్లే నాకు ఇంకా పెళ్లి కావడం లేద"ని ఫన్నీగా సమాధానమిచ్చింది కంగన. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల కోసం కంగనా రనౌత్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!

Also Read: SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట'... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News