Sharan Kumar Sakshi Teaser సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతోన్నాడు. సాక్షి సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుడు శరణ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ సినిమాకు శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం  వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో  తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్స్ చేతుల మీదగా ఈ  చిత్ర టీజర్‌ను లాంచ్ చేయించారు. 69 సెకన్లున్న ఈ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గంజాయి స్మగ్లింగ్ పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాను తీసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో శ‌రణ్ కుమార్ ఫైట్ సీన్స్ బాగున్నాయి. ప్రేక్షకుల్లో సాక్షి సినిమాపై హోప్స్ పెంచేసింది ఈ టీజర్.


 



సాక్షి సినిమా నుంచి హీరో లుక్‌ను ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్‌కి సైతం మంచి హైప్ వచ్చింది.  నాగబాబు పాత్రకు సంబంధించిన లుక్ వైరల్ అయింది. ఇప్పుడు టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల దృష్టి మరింతగా పడింది.


Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!


ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని   ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించడంతో పాటల మీద హైప్ పెరిగింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతోన్నారు.


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK