Mahesh Babu Leaving to London Halting SSMB 28 Shoot: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కన్నతల్లి ఇందిరాదేవి అనారోగ్య కారణాలతో కన్నుమూయడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సహా ఆయన తండ్రి కృష్ణ అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఇటీవల మహేష్ తన తల్లి కర్మకాండలు కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదు. ఆరంభం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది రెండవ షెడ్యూల్ అక్టోబర్ రెండో వారంలో ప్రారంభించాలని అనుకున్నారు. దసరా పూర్తి అయిన తర్వాత షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటే మహేష్ కుటుంబంలో ఏర్పడిన విషాదం కారణంగా ప్రారంభించాల్సిన షూటింగ్ వాయిదా పడింది.  


ఇప్పుడు మహేష్ బాబు మరి కొన్నాళ్లపాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ షూటింగ్ నిలిపివేసి మరి ఆయన లండన్ వెళుతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ చదువుల నిమిత్తం లండన్ లో  ఉంటున్నారు. ఇందిరాదేవి మరణం సంభవించినప్పుడు ఆమెను చివరి చూపుల కోసం రాలేకపోయిన గౌతం ఆమె దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డాడు.


ఇప్పుడు ఆయనని డ్రాప్ చేసి ఎందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్ళబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎలాగో ఇన్ని రోజులు ఆగారు కాబట్టి మరి కొన్ని రోజులు ఆగాలని ఆయన సినిమా యూనిట్ ని కోరినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద ఈ సినిమాను చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తాడని ఒక ప్రచారం జరుగుతుండగా కాదని మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడని మరో ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ బాబు లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రకు తగినట్లుగానే ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విషయం మీద సినిమా విడుదల అయితే కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.


Also Read: Samantha No.1 in Tollywood: ఈ ఏడాదిలో ఒక్క సినిమా రిలీజ్ అవ్వకున్నా సమంతే టాలీవుడ్ క్వీన్!


Also Read: Chiranjeevi Responded on Garikipati: గరికపాటి వివాదం పై చిరు భిన్న స్పందన.. ఆ అవసరమే లేదంటూ కామెంట్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook