Murari Re Release collections: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో  పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఎక్కువపోయాయి. ఆల్రెడీ ఓటీటీ, యూట్యూబ్ లో చూసేసిన సినిమాలను మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ రీ రిలీజ్ లను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కానీ తాజాగా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా మళ్లీ విడుదలైన ‘మురారి’ చిత్రం రికార్డుల ఊచకోత కోస్తోంది. ఈ సినిమా ఆగష్టు 9న తొలి రోజు  రీ రిలీజ్ లో రూ. 5.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ మధ్యకాలంలో విడుదలైన మీడియం రేంజ్ చిత్రాల కంటే ఈ సినిమాకు ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు దక్కడం విశేషం. మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 8.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ వరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా తెలుగులో రీ రిలీజ్ లపై ఆసక్తి తగ్గుతున్న ఈ సమయంలో మురారి సినిమా టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం మాములు విషయం కాదు. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో తెలుగులో ఖుషీ మూవీ రూ. 7.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం విశేషం.  
మహేష్ బాబు కథానాయకుడిగా యాక్ట్ చేసిన  4వ చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎన్.రామలింగేశ్వరావు  ఈ సినిమాను నిర్మించడం విశేషం. ‘మురారి’ సినిమా 2001 ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది.దాదాపు 23 యేళ్ల తర్వాత రీ రిలీజైన ఈ సినిమా ఇపుడు కూడా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించడం మాములు విషయం కాదంటున్నారు.


ఒక కుటుంబానికి సంబంధించిన శాపం నేపథ్యంలో కృష్ణవంశీ ఈ సినిమాను ఎంతో రీసెర్చి చేసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే మురారి తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలు ఇప్పటికీ అద్భుతమనే చెప్పాలి. మరోవైపు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో ‘మురారి’ సినిమా 175 రోజులకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత సుదర్శన్ 35 ఎంఎంలో ‘అతడు’, పోకిరి’ సినిమాలు కూడా  రజతోత్సవం పూర్తి చేసుకోవడం విశేషం.


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter