Rajinikanth Gets COVID-19 Vaccination: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వీలైనంత మోతాదులో కరోనా వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఆక్సిజన్ ట్యాంకర్లు, రెమిడెసివర్ ఇంజక్షన్లు, కరోనా కిట్లను సైతం కేంద్ర వైద్యశాఖ అందిస్తోంది. ఇటీవల మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైనా యువతకు మాత్రం టీకాలు ఇవ్వడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాది సూపర్ స్టార్, నటుడు రజనీకాంత్ నేడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల తొలి డోసు టీకా తీసుకున్న రజనీకాంత్, గురువారం నాడు చెన్నైలోని తన నివాసంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఆ సమయంలో తండ్రి రజనీకాంత్ వెంట ఆయన కూతురు సౌందర్య కూడా ఉన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకున్నారని టాలీవుడ్ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు.


Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే



కాగా, రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా అన్నాత్తే. దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. రజనీకాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తికావడంతో ఆయన ప్రత్యేక విమానంలో బుధవారం చెన్నైకి వెళ్లిపోయారు. తొలి డోసు కరోనా టీకా తీసుకున్న రజనీకాంత్ ఏ భయాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. నిన్న చెన్నైకి చేరుకున్న ఆయన నేడు కరోనా టీకా రెండో డోసు సైతం తీసుకుని కరోనాపై పోరాటంతో తన బాధ్యత నిర్వర్తించారు.


సూపర్‌స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమాలో కీర్తి సురేష్(Keerthy Suresh), నయనతారలు కథానాయికలు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఓ ప్రధాన పాత్రలో ప్రకాష్‌రాజ్‌ కనిపించనున్నారు. రజనీ పార్ట్ షూటింగ్ పూర్తయింది, కొందరు నటీనటులపై షూటింగ్ పార్ట్ మిగిలిఉన్నట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఇంటికి పరిమితం కావాలని రజనీకాంత్ భావిస్తున్నారు.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook