టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. దక్షిణాదిన క్రేజీ నటులలో మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన అరుదైన క్లబ్‌లో చేరిపోయారు. క్రమం తప్పకుండా తన ఫ్యామిలీ విషయాలతో పాటు సినిమా అప్ డేట్స్ అందిస్తుంటారు. సామాజిక అంశాలపై సైతం తనకు తోచిన రీతిలో స్పందించే సూపర్ స్టార్ తన ఫాలోయర్లకు 90 లక్షల ధన్యవాదాలు తెలిపారు మహేష్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విషయం ఏంటంటే.. ట్విట్టర్‌లో ఆయన ఫాలోయర్ల సంఖ్య 9 మిలియన్లు (90 లక్షలు) చేరింది. దీంతో తనపై ప్రేమ, అభిమానాన్ని చూపించి, ఈ అమేజింగ్ జర్నీలో భాగస్వాములైన ఫాలోయర్లకు, అభిమానులకు మహేష్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉత్తరాదితో పాటు దక్షిణాది నటులలో ఈ అరుదైన మార్క్ చేరుకున్న హీరో మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిన ఈ రికార్డు సాధించిన తొలి నటుడిగా మహేష్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.


స్త్రీ శక్తికి ‘హ్యాపీ ఉమెన్స్ డే’ విషెష్ ఇలా తెలపండి



కాగా, సినిమాల విషయానికొస్తే పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచర్యలో గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.


Also Read: ఉమెన్స్ డే 2020కి గూగుల్ స్పెషల్ డూడుల్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..