Superstar Rajinikanth Birthday Special: అతనిది మనోహరమైన రూపం కాదు. అంత ఎత్తు కూడా ఉండడు. సిక్స్ ప్యాక్ బాడీ కూడా లేదు. బాలీవుడ్ హీరోల మాదిరి పెద్దగా కలర్ కూడా ఉండడు. కానీ ఆయన స్టైలంటే అభిమానులకు పిచ్చి. ఇక ఆయన సినిమా రిలీజ్‌ అవుతుందంటే నెల రోజుల ముందు నుంచే పండగ సంబురాలు. ఏకంగా ఐటీ కంపెనీలకు సెలవులు ఇచ్చేంత క్రేజ్ ఆయన సొంతం. ఇంత స్టార్‌డమ్ ఉన్న ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఆయనే సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పుట్టినరోజు నేడు (డిసెంబర్ 12). 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న మరాఠీ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు శివాజీ రావ్ గైక్వాడ్ అని పేరు పెట్టారు. రజినీకాంత్‌కు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతను చిన్నవాడు. రజినీకాంత్ తండ్రి పోలీస్ హెడ్ కానిస్టేబుల్. తల్లి జీజాబాయి చిన్నతనంలోనే మరణించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రజినీకాంత్ మొదట ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అతను కూలీగా సరుకులు ఎత్తాడు. పెద్దగా ఆదాయం లేకపోవడంతో కార్పెంటర్ పని మొదలుపెట్టాడు. ఆ తరువాత చాలా కష్టపడి బీటీఎస్‌లో బస్‌ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. టిక్కెట్లు అమ్ముతూ, ఈలలు వేస్తూ బస్సులో ప్రయాణికులను అలరించేవాడు. 


రజినీకాంత్ రామకృష్ణ మఠంలో చదువుకునే సమయంలో వేద-పురాణం నాటకాల్లో నటించేవాడు. అప్పటి నుంచే ఆయనకు నటనపై ఆసక్తి పెరిగింది. కండక్టర్ జాబ్ వదులుకుని.. మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒక డ్రామాలో దుర్యోధనుడి పాత్రను పోషించి.. దర్శకుడు కె.బాలచంద్రన్‌ను బాగా ఆకట్టుకున్నాడు. 'అపూర్వ రాగంగల్' అనే కమల్ హాసన్‌ సినిమాలో చిన్న పాత్ర పోషించి వెండితెరపై అరంగేట్రం చేశాడు. ఇక అక్కడి నుంచి సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్నారు. 


సౌత్ సినిమా పరిశ్రమ నుంచి బాలీవుడ్ చిత్రాల వరకు తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రజినీకాంత్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సూపర్ స్టార్. బిగ్‌ స్క్రీన్‌పై చాలా మంది హీరోయిన్స్‌తో జతకట్టారు. అలనాటి అందాలతార శ్రీదేవితో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరూ కలిసి దాదాపు 25 సినిమాల్లో పనిచేశారు.


రజినీకాంత్‌కు ఆరోగ్యం బాగోలేని సమయంలో శ్రీదేవి ఏడు రోజులపాటు నిరహార దీక్ష చేశారు. రజినీకాంత్ 2011లో తన 'రానా' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలియగానే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడేందుకు షిర్డీ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. షిర్డీని సందర్శించిన తర్వాత.. రజినీకాంత్ ఆరోగ్యం కోసం 7 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశారు. ఆ తరువాత రజినీకాంత్ పూర్తిగా కోలుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. రజినీకాంత్ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే శ్రీదేవి తన భర్త బోనీకపూర్‌తో కలిసి ఆయనను కలవడానికి వచ్చారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వడంతో శ్రీవేది సంబరపడిపోయారు. ఈ విషయాన్ని గతంలో సూపర్‌స్టార్ ఓ ఇంటర్వూలో గుర్తు చేసుకున్నారు. 


Also Read: CM KCR Delhi Tour: నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్


Also Read: కాపీ కొట్టి 10th పాసయ్యా.. నేను కాపీయింగ్‌లో పీహెచ్‌డీ చేశా! విద్యార్థులతో మంత్రి సంచలన వ్యాఖ్యలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook