Rajinikanth Jailer Day 1 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తలైవా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది జైలర్ మూవీ హిట్ టాక్ రావడంతో ఇక కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయోనని సినీ ప్రియులు అంటున్నారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95.78 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో రూ.29.46 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.12.04 కోట్లు, కర్ణాటకలో రూ.11.92 కోట్లు, విదేశాల్లో రూ. 32.75 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. వరుసగా సెలవులు ఉండటంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ కలెక్షన్స్ ఆమాంతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ నేడు విడుదలవ్వగా.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కువ మంది ఆడియన్స్ జైలర్ సినిమా చూసే ఛాన్స్ ఉంది. వరుస సెలవుల నేపథ్యంలో ఆడియన్స్ థియేటర్లకు క్యూకట్టే అవకాశం ఉంది. తలైవా బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టి చాలా రోజులే కాగా.. జైలర్ అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళంలో దీటుగా తెలుగులో కూడా కలెక్షన్లు రాబడుతుండడం చూస్తే.. సూపర్ స్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.


నైజాంలోనే గురువారం మొదటి రోజే 3.21 కోట్లు వసూళ్లు రాబట్టింది జైలర్. సీడెడ్‌లో 94 లక్షలు, ఉత్తరాంధ్రలో 81 లక్షలు, ఈస్ట్ 40 లక్షలు, వెస్ట్ 33 లక్షలు, గుంటూరు 65 లక్షలు, కృష్ణా 45 లక్షలు, నెల్లూరు 22 లక్షల వసూళ్లను రాబట్టి.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. జైలర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.01 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను రూ.12 కోట్లకే అమ్మినట్లు తెలుస్తోంది. అంటే తొలిరోజే 50 శాతానికిపైగా కలెక్షన్లు రాబట్టింది. మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆగస్టు 15వ వరకు సెలవులు ఉండడంతో కాసుల వర్షం కురిపించనుంది.  


Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  


Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి