Surekha Vani Marriage : రెండో పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోందా?.. సురేఖ వాణి పోస్ట్ అర్థం అదేనా
Surekha Vani About Ashish Vidyarthi సురేఖా వాణి కోసం అంకుల్స్ అంతా క్యూ కడుతున్నట్టుగా ఎన్ని మీమ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. వాటిని చూస్తూ సురేఖా వాణి కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది. సురేఖా వాణి తాజాగా ఓ ఫన్నీ రీల్‌ను షేర్ చేసింది. అందులో పెళ్లి గురించి కామెంట్ ఉంది.
Surekha Vani Second Marriage ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. నరేష్ పవిత్రల ఇష్యూ తరువాత అరవై ఏండ్ల వయసులోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. మాకు మాత్రం పెళ్లిళ్లు అవ్వడం లేదంటూ సింగిల్స్ బాధలను చూపిస్తూ మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాకుండా తాజాగా టాలీవుడ్ విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ ఆశిష్ విద్యార్థి అరవై ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. ముప్పై మూడేళ్ల అమ్మాయిని ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్ రీల్స్ ఎక్కువ అయ్యాయి.
మామూలుగానే సురేఖా వాణి సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్, ట్రోల్స్, ఫన్నీ రీల్స్ పట్ల ఎప్పుడూ స్పందిస్తుంటుంది. పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారం, మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట చేస్తున్న రచ్చ ఇలా అందరికీ తెలిసిందే. మోస్ట్ ట్రెండింగ్ కపుల్స్‌గా నరేష్ పవిత్రలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి తోడుగా ఇప్పుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ రెండింటిని కలిపి సింగిల్స్ బాధలను చూపించేలా ఓ రీల్ వీడియో చేశారు.
[[{"fid":"274345","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ముసలోళ్లకి, ముతకోల్లకి పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు ఎందుకు అవ్వడం లేదురా అంటూ సాగే ఫన్నీ రీల్‌ను ఇప్పుడు సురేఖా వాణి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. అంటే సురేఖా వాణికి సైతం రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్టుగా ఈ పోస్ట్‌తో అర్థం అవుతోంది. అందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.. ఈ వయసులోనూ చేసుకుంటున్నారు.. నాకు మాత్రం ఎందుకు అవ్వడం లేదన్నట్టుగా సురేఖా వాణి పరోక్షంగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
సురేఖా వాణి తన మొదటి భర్త మరణం తరువాత ఎన్ని రకాల ట్రోలింగ్‌లు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. భర్త చనిపోయిన కొన్ని రోజులకే టిక్ టాక్‌లో తన కూతురు సుప్రితతో కలిసి రకరకాల డ్యాన్స్ వీడియోలు చేయసాగింది. కూతురితో కలిసి ఫారిన్ ట్రిప్‌లు వేస్తుండేది. ఇక సుప్రిత రెండో పెళ్లికి సిద్దమైందనే రూమర్లు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటి మీద సురేఖా వాణి, సుప్రితలు కూడా చాలా సార్లు స్పందించారు. అవన్నీ రూమర్లేనని ఖండించారు.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK