Megastar Chiranjeevi: చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. గాడ్ ఫాదర్ షూటింగ్‌కి బ్రేక్!
Megastar Chiranjeevi:కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండటం అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. ఈ నేపథ్యంలో..తన గాయంపై చిరు స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగా అభిమానుల(Mega Fans)తో ఆదివారం చిరంజీవి(Megastar Chiranjeevi) భేటీ అయ్యారు. కరోనా బారిన పడి ఆక్సిజన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు(Oxgyen Banks) నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
Also read: Megastar Chiranjeevi : ఆ ఘటనతోనే ఆక్సిజన్ బ్యాంకు ఆలోచన వచ్చింది - చిరంజీవి
ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండటంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చేతికి ఏమైనా గాయమైందేమోనని ఆయనను అడగ్గా, తన అరచేతికి చిన్నపాటి సర్జరీ (Surgery) జరిగిందని చెప్పారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా ఉండటంతో వైద్యులను కలిసినట్లు చిరు వెల్లడించారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’(carpal tunnel syndrome) అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు.
అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యథావిధిగా పని చేస్తుందని వివరించారు. సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ‘గాడ్ ఫాదర్’(God Father Movie) షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చినట్లు వెల్లడించారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు అభిమానులకు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి