Global Community Oscars 2021: `గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్`కు నామినేట్ అయిన ఉదయనిధి, సూర్య దంపతులు..
Global Community Oscars 2021: కోలీవుడ్ నటులు సూర్య, జ్యోతిక, ఉదయనిధి స్టాలిన్ లకు అరుదైన గౌరవం దక్కింది. వీరు గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డ్సు 2021కి నామినేట్ అయ్యారు.
Global Community Oscar Awards 2021: గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డుల 2021 జాబితాలో హీరో సూర్య దంపతులు, నటుడు, డీఎమ్‌కే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)చోటు దక్కించుకున్నారు. మానవతా విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు చేస్తున్నందుకు సూర్య దంపతులు (Suriya- Jyothika) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక ఉదయనిధి స్టాలిన్ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ..యువకులను రాజకీయాల్లోకి ప్రవేశించమని ప్రోత్సాహిస్తున్నారు. అందుకుగానూ ఆయన ఈ అవార్డు నామినీల్లో చోటు సంపాదించారు.
యూఎస్ లో ఫిబ్రవరి 19న జరగనున్న ఇంటర్నేషనల్ ఎమర్జింగ్ స్టార్ అవార్డు వేడుకలో గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డును (Global Community Oscar Awards 2021) అందజేయనున్నారు. కోలీవుడ్ (Kollywood)కు చెందిన ముగ్గురు స్టార్ నటులు అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకుంటారో లేదో వేచి చూడాలి. ఈ విషయం తెలిసి వీరి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవల సూర్య-జ్యోతిక దంపతులు నిర్మించిన 'జై భీమ్' సినిమాలోని సన్నివేశాలకు ప్రఖ్యాత ఆస్కార్ యూట్యూబ్‌లో చోటు కూడా దక్కింది.
Also Read: Varun Tej Lavanya Marriage: నటి లావణ్యతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి.. నెట్టింట ప్రచారం!
ప్రస్తుతం సూర్య (Hero Suriya) పాండిరాజ్ దర్శకత్వంలో ఎతుర్కుం తునింధవన్ (Etharkkum Thunindhavan) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఉదయనిధి విషయానికొస్తే..ఆయన ము. మారన్ దర్శకత్వంలో 'కన్నై నంబతే' (Kannai Nambathey) అనే క్రైమ్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన ఆత్మిక నటిస్తోంది. ఈ చిత్రంలో సతీష్, భూమిక చావ్లా సపోర్టివ్ రోల్స్‌లో నటించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook