Kanguva trailer talk: టాలీవుడ్ లో స్టార్ హీరో సూర్యకి తెలుగులో కూడా మంచి.. ఫాన్ ఫాలోయింగ్ ఉంది. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించే సూర్య.. తాజాగా ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండున్నర నిమిషాల.. నిడివి ఉన్న ఈ ట్రైలర్.. మొదలవుతూనే మనకి ఒక ద్వీపాన్ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటెన్స్ విలన్ లుక్ లో.. బాలీవుడ్ నటుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రైలర్ చూస్తే సినిమాలో సూర్య ఎంట్రీ సీన్ కి కచ్చితంగా ఫాన్స్ ఇంప్రెస్స్ అవుతారని చెప్పుకోవచ్చు. 


సరికొత్త లుక్ లో సూర్య అందరి.. దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా విజువల్స్ అదిరిపోయే రేంజ్ లో.. ఉంటాయి అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రతి సీన్ ని ఎలివేట్ చేసేలాగా కనిపిస్తోంది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం ట్రైలర్ లో కొంచెం నిరాశపరిచింది. 


ఇక నటీనటులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ లో సూర్య కన్నా బాబీ డియోల్ కి.. ఎక్కువ మార్కులు పడ్డాయి. బాబీ డియెల్ నటన.. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పుకోవచ్చు. కాగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. 


ఈ సంవత్సరం విడుదల కాబోయే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలలో.. ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఖచ్చితంగా సూర్య కెరియర్ లోనే కీలక మలుపు ఇచ్చే సినిమా.. అవుతుంది అని బలంగా టాక్ వినిపిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తూనే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు.. తిరగ రాయడం ఖాయం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 


దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా.. కనిపించనుంది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో జ్ఞాన వేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2డీలో మాత్రమే కాక ఈ సినిమా త్రీడీ, ఐమాక్స్ ఫార్మేట్ లలో కూడా విడుదల కి సిద్ధం అవుతోంది.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter