Kanguva movie update: సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి తమిళ్ స్టార్ హీరోలకు.. టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. వీళ్ల తర్వాత అదే రేంజ్‌లో తెలుగులో పాపులర్ అయిన హీరో సూర్య. సూర్య సినిమాలు చాలా వరకు తెలుగులో రిలీజ్ అవ్వడమే కాకుండా.. మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తాయి. ప్రస్తుతం సూర్య ‘ కంగువ ‘ అని భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి.. రెడీ అవుతున్నాడు. కోలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. దర్శకత్వ బాధ్యతలు తెలుగులో శౌర్యం, దరువు లాంటి సినిమాలను తెరకెక్కించిన శివ వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ నుంచి ఇప్పటికే.. విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. మరీ ముఖ్యంగా.. ఆమధ్య మూవీ నుంచి విడుదలైన.. టీజర్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏడాది కిందట మొదలైంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలి.. అనే ఉద్దేశంతో చిత్ర బృందం మూవీకి సంబంధించిన షూటింగ్ పనులను చక చక పూర్తి చేసుకుంటూ.. వస్తున్నారు. 


ఈ సంవత్సరం ద్వితీయర్థంలో.. విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో మంచి బజ్ సృష్టించిన మూవీలలో.. సూర్య కంగువ కూడా ఉంది. ఈ మూవీ కచ్చితంగా సూర్య కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుంది అన్న.. టాక్ తమిళ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తౌంది. సాధారణంగా చిత్రాల విడుదలకి.. ఓ రెండు మూడు వారాల ముందు ట్రైలర్‌ని రిలీజ్ చేసి మూవీపై హైప్ పెంచుతారు. అయితే విడుదలకి నెలల.. ముందే టీజర్‌ని విడుదల చేసి కంగువ చిత్ర బృందం సరికొత్త ట్రెండ్‌కి నాంది పలుకుతోంది. 


అవును విడుదలకి రెండు నెలల ముందే ‘కంగువ’ మూవీ.. ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం ట్రైలర్ విడుదల‌కి ముహూర్తం ఫిక్స్ అయింది. మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి కావడంతో పాటు ఫస్ట్ కాపీ కూడా రెడీ కావస్తోందని టాక్. దీంతో ట్రైలర్‌ని ముందుగా విడుదల చేసి చిత్రంపై మరింత బజ్ పెంచడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. 


ట్రైలర్ విడుదల తర్వాత.. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. పక్క ప్లానింగ్‌తో చాలా ముందు నుంచి మూవీని ప్రేక్షకులలో గట్టిగా తీసుకువెళ్లడానికి మూవీ టీం బాగా కష్టపడుతున్నారు. అంతేకాదు ఈ చిత్రం బాహుబలి తరహాలో.. బాక్స ఆఫీస్  రికార్డులు సృష్టిస్తుందని సినిమా టీం నమ్ముతోంది.అందుకే మూవీకి హైప్ పెంచి మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter