Sushant Singh Rajput Fans Trend Boycott 83: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) జీవిత కథ ఆధారంగా  తెరకెక్కిన '83' సినిమా శుక్రవారం (డిసెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రల్లో నటించారు. 1983 వన్డే ప్రపంచకప్ (1983 WC) ఫైనల్‌లో పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించిన కపిల్ డెవిల్స్.. తొలి ఐసీసీ ట్రోఫీని ఎలా గెలుచుకుంది అనే ఎమోషన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన 83 సినిమా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తూ చివరికి ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు (Sushant Singh Rajput  Fans) 83 సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దాంతో ‘బాయ్‌కాట్ 83’ (Boycott 83) అనే హ్యాష్‌ట్యాగ్ ఈరోజు ఉదయం నుంచి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాయ్‌కాట్ 83 ట్రెండింగ్‌ అవ్వడానికి కారణం లేకపోలేదు. గత సంవత్సరం విడుదలైన చిప్స్ యాడ్‌లో సుశాంత్‌ను ఎగతాళి చేసినందుకు ఆయన అభిమానులు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)పై పగ తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రణ్‌వీర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 83 సినిమా ఫ్లాప్ అంటూ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, కబీర్ ఖాన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 


Also Read: IND vs SA: అజింక్య రహానే లేదా హనుమ విహారి.. 5వ స్థానంలో ఎవరు ఆడతారు? కేఎల్‌ రాహుల్‌ ఏం చెప్పాడంటే?


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి ఏడాది పైగా గడిచిపోయినా అభిమానుల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. #Boycott83,  #BoycottBollywood అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రణవీర్ సింగ్, ఇతర నకిలీ బాలీవుడ్ స్టార్లు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ (ISI) ఏజెంట్లతో ఎలా పార్టీలు చేసుకుంటున్నారో చూడండి అంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 83 సినిమాకు ఈ రకంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఈ సినిమాలో తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీమ్, హార్డీ సంధు, అమీ విర్క్, జీవా తదితరులు నటించారు.


Also Read: Porn Star Offers Footballer: రష్యన్ ఫుట్ బాలర్ కు పోర్న్ స్టార్ సెక్స్ ఆఫర్.. 16 గంటలపాటు ఏకధాటిగా..








స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి