Dil Bechara trailer: న్యూఢిల్లీ:  దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) చివరి చిత్రం 'దిల్ బెచారా' (Dil Bechara) విడుదల తేదీ ఖరారైనప్పటి నుంచి ఈ చిత్రం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిజంగా అద్భుతమైన నటుడని ఈ ట్రైలర్ మరోసారి రుజువు చేసింది. Also read: Sushant Singh Rajput: సుశాంత్ పేరుపై ఒక నక్షత్రం

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న యువతిని ఓ యువకుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ ట్రైలర్‌లో హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా వారి పాత్రల్లో చాలా పర్ఫెక్ట్‌గా కనిపించారు. సుశాంత్ నటన కూడా ఆయన గత చిత్రాల్లో మాదిరిగానే ఫెంటాస్టిక్‌గా ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సుశాంత్ అభిమానుల కంట కన్నీరు రాకుండా ఉండదు. Also read: ajay devgn: బిగ్ స్క్రీన్‌పై.. గాల్వన్ వీరుల శౌర్యం..
 
అయితే సుశాంత్ 'దిల్ బెచారా' చిత్రానికి ముఖేష్ ఛబ్రా (Mukesh Chhabra) దర్శకత్వం వహించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుశాంత్ సరసన సంజన సంఘి (Sanjana Sanghi) నటించింది. ఇంకా ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, స్వస్తిక ముఖర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 24న OTT ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. Also read: 
సుశాంత్ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వైరల్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిచెందిన తరువాత కూడా ఆయన్ను అమితంగా ఇష్టపడేవారెవరూ మరిపోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా.. సుశాంత్ పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..