సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) ఆత్మహత్య తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెపోటిజం ( Nepotism ) గురించి చర్చలు మొదలయ్యాయి. అదే సమయంలో పోలీసులు కూడా సుశాంత్ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput Suicide ) ప్రేరేపించిన పరిస్థితులపై దర్యాప్తును వేగవంతం చేశారు. అదే సమయంలో అతని అభిమానులు ఇప్పటికీ అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా రక్షా అనే అభిమాని సుశాంత్ పేరును ఒక నక్షత్రానికి ( Sushant Singh Rajput Star ) పెట్టారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసిన రక్ష అనే ఫ్యాన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను అందులో షేర్ చేశారు. “సుశాంత్ ఎప్పుడూ తారమండలంలో ( Clusters of Stars ) ప్రకాశవంతంగా మెరుస్తూనే ( Glittering Star ) ఉంటాడు. నేను అతని పేరును ఒక నక్షత్రానికి పెట్టాను. ఇకపై అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించగలను. నువ్వు నిత్య నూతనకంగా ప్రకాశించాలి” అని అభిమాని తన ట్వీట్లలో రాశారు. Also Read : AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటుడిగానే ( Actor Sushant Singh Rajput ) కాకుండా వివిధ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి కూడా. ముఖ్యంగా సౌరమండలంపై ( Solar System ) అతనికి మంచి అవగాహణ, ఆసక్తి ఉండేది. దీంతో రక్షా అనే ఆభిమాని అతని పేరుపై ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసిన వివరాలను షేర్ చేశారు. ఈ నక్షత్రం RA 22.121 (RA 22.121 ) అనే పొజిషన్ లో ఉంటుంది. దీనికి 25 జూన్ 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అని నామకరణం చేసిన విషయాన్ని ప్రకటించింది. ఈ పేరు శాశ్వతం అని దీనిపై కాపిరైట్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మాత్రమే సొంతం అని తెలిపింది రక్ష.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..