Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ( Swetha Singh Kirti ) ఇటీవలే ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక బిల్ బోర్డులో #JusticeForSushantSinghRajput అని రాసి ఉంది. ఈ బిల్ బోర్డు అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి సంబంధించింది. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం ( Nepotism ) పై ఉద్యమం మొదలైంది. సుశాంత్ కు న్యాయం కలగాలి అని దేశ వ్యాప్తంగా డిమాండ్ మొదలైంది.





#JusticeForSushantSinghRajput ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోంది అని అమె సోదరి శ్వేత తెలిపారు. కాలిఫోర్నియాలో నా సోదరుడిపై ఏర్పాటు ( Sushant Billboard in California ) చేసిన బిల్ బోర్డు.. ఇది 880 ఉత్తరాన గ్రేట్ మాల్ ఎగ్జిట్ దగ్గర ఉంది. ప్రపంచ ఉద్యమంగా మారింది అని పోస్ట్ చేసింది. ఈ పోస్టులో సుశాంత్ ఫేస్ తో పాటు అతని పుట్టిన సంవత్సరం- మరణించిన సంవత్సరం ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ముంబై పోలీసులతో పాలు బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) ఇటీవలే ఎంఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆఫీసులో విచారణకు హాజరైంది.


Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం