Sushmita Sen Heart Attack మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌కు గత కొన్ని రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సుష్మితా సేన్ బయటపెట్టేసింది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది. అయితే సుష్మితా సేన్ ఇప్పుడు తన పరిస్థితి గురించి చెప్పడానికి కూడా ఓ కారణం ఉందని పేర్కొంది. ఇప్పుడు సుష్మితా సేన్ ఆరోగ్యం గురించి తెలిసి, బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు కాస్త శాంతించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండెను ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి.. అలా ఉంటే.. ఆ గుండె మీకు ఆపత్కాల సమయంలో అండగా ఉంటుంది అని మా తండ్రి చెప్పాడు. కొన్ని రోజుల క్రితం నేను గుండెపోటుతో సతమతమయ్యాను. ఆంజియోప్లాస్టీ చేశారు. స్టంట్ వేశారు. నా హృదయం చాలా పెద్దదని మా కార్డియాలజిస్ట్ చెప్పాడు. నేను ఎంతో మందికి థాంక్స్ చెప్పాలి.. అవన్నీ ఇంకో పోస్ట్‌లో చెబుతాను. నేను మీకో గుడ్ న్యూస్ చెప్పాలని ఈ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను.. మళ్లీ షూటింగ్‌లంటూ లైఫ్‌తో బిజీగా ఉండేందుకు రెడీగా ఉన్నాను.. అంటూ అసలు విషయాలను చెప్పేసింది సుష్మితా సేన్.


 



గతంలో ఓ సారి సుష్మితా సేన్ కూడా తన కష్టకాలం గురించి చెప్పుకొచ్చింది. ఓ ఐదేళ్ల పాటు నరకం అనుభవించానని, ఇక తన పని అయిపోయిందని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆర్య అనే వెబ్ సిరీస్ వచ్చిందని, అది బాగా సక్సెస్ అవ్వడంతో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయానని సుష్మితా సేన్ చెప్పుకొచ్చింది. ఇక ఒకానొక సమయంలో తన జుట్టు ఊడిపోతూ, చర్మంలో మార్పులు రావడం ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పుకొచ్చింది.


ఆర్య మూడో సీజన్‌లోనూ సుష్మిత సేన్ మెప్పించింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో సుష్మితా సేన్‌ ఫుల్ బిజీగా ఉంటోంది. గుండె పోటు నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ వెంటనే ప్రాజెక్ట్‌లను ఓకే చేసేలా కనిపిస్తోంది.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook