Kalki Premieres: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. టిడిపి పవర్ లోకి రాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఎంపికయ్యారు. పవన్ కళ్యాణ్ రాకతో.. సినిమాలకి మంచి రోజులు వచ్చాయని ఎప్పటినుంచో వింటున్న మాటే. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు.. ఈనెల 27న విడుదల కాబోతున్న ప్రభాస్ కల్కి.. సినిమా మీదనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టికెట్ రేట్లు పెంపుదల, స్పెషల్ షో లకు పర్మిషన్లు గురించి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ప్రీమియర్ల మీద కూడా ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే రాత్రి ఒంటిగంట షో చెయ్యాలా వద్ద ..అని కల్కి బృందం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. యుఎస్ఏ లో అదే సమయానికి ప్రీమియర్లు మొదలైపోతాయి. ఇండియా టైం ప్రకారం
. ఉదయం లేచేలోపు అక్కడి నుంచి రివ్యూలు సోషల్ మీడియాలో గుప్పుమంటాయి. ఓవర్సీస్ లో కూడా సినిమా మీద బీభత్సమైన క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్ లో హాట్ కేకుల లాగా సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి. బాహుబలి, సలార్ సినిమాల కంటే కల్కి సినిమా ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు తీసుకువస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.


ఈ నేపథ్యంలో ప్రీమియర్లు బయటకు వచ్చేస్తే రిపోర్టులు, స్పాయిలర్లు కూడా ఎక్కువ అయిపోతాయి. టాక్ బాగానే ఉంటే అది సినిమాకి చాలా బాగా ప్లస్ అవుతుంది కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అది సినిమా ఓపెనింగ్స్ తో పాటు.. మిగతా కలెక్షన్లను భారీగా దెబ్బతిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఈ సినిమా షోలు పడాలి అంటే ఇండియా వైడ్ గా అర్ధరాత్రి సినిమాని విడుదల చేయాలి. 


తెలంగాణలో సింగిల్ స్క్రీన్ల వరకు అర్ధరాత్రి ఒంటిగంట షో వేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయానికి షో పడాలి అంటే అక్కడ కూడా పర్మిషన్లు తీసుకోవాలి. నిర్మాత అశ్విని దత్, డైరెక్టర్ నాగ అశ్విన్.. దీని గురించిన చర్చలు నడుపుతున్నారు కానీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. 


ఇక జనాలు థియేటర్ల దగ్గర పోటెత్తుతారు అని బయర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదటి వారంతం పూర్తయ్యేసరికి కలెక్షన్లు ఆకాశాన్ని అంటుతాయని ట్రేడ్ వర్గాలు కూడా ముందే చెబుతున్నాయి.


Also Read: Pawan Kalyan: పవన్ పేషీలో పవర్ ఫుల్ ఐఏఎస్.. కేంద్రానికి స్పెషల్ గా లేఖ.. ఎందుకో తెలుసా.? 


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter