Bhari Taraganam Trailer కమెడియన్ అలీ దగ్గరి బంధువు అయిన సదన్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. భారీ తారాగణం అంటూ రాబోతోన్న ఈ మూవీలో సదన్ నటిస్తున్నాడు. సదన్ సరసన దీపికా రెడ్డి, రేఖ నిరోషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ట్రైలర్ అనంతరం.. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి లు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారని అన్నాడు. ఇందులో ఆలీ నటించాడని, తనకు ఇష్టమైన  బాబా గారి కొడుకు ఇందులో హీరో గా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. 


నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉందని మెచ్చుకున్నాడు. కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మా అన్న కొడుకు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తను ఇలాగే మంచి చిత్రాలలో నటించి పెద్ద హీరో అవ్వాలని  కోరుకుంటున్నాను అని అన్నాడు.


 



హీరో సదన్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అని అన్నాడు. నిర్మాత బివి.రెడ్డి మాట్లాడుతూ.. సెకెండ్ వేవ్‌లో సినిమా స్టార్ట్ అయిందని, టీం అంతా ఎంతో సహకరించిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తమ సినిమా గురించి చెప్పుకున్నాడు. డైరెక్టర్ శేఖర్ ముత్యాల మాట్లాడుతూ.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పని చేశామని తెలిపాడు. లవ్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టుగా తెలిపాడు.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook