SV Ranga Rao Grand Sons on Balakrishna Controversy: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు అటు అక్కినేని అభిమానులకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. అయితే రంగారావు అనే పేరు మాట్లాడడంతో ఆయన ఎస్వీ రంగారావు గారిని కించపరిచారు అంటూ కాపునాడు అనే సంస్థ నందమూరి బాలకృష్ణ సహా తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం కూడా జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు కాపునాడు షాక్ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఇదంతా వైసీపీ కుట్ర అని అలాంటి వాటి ట్రాప్ లో పడద్దని చెబుతూ ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా కాపునాడుకి షాక్ ఇస్తూ ఎస్వీ రంగారావు వారసులు లైన్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఒక వీడియో కూడా విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయని అయితే స్వర్గీయ శ్రీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా మనవళ్లుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాము అని వారు చెప్పుకొచ్చారు.


మాకు బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉందని మేము ఒక కుటుంబం గానే ఉంటామని వారు చెప్పుకువచ్చారు. ఆయన మాట్లాడింది తోటి నటుడుతో  జరిగిన సంభాషణ గురించి అది కూడా చాలా జనరల్ గా చెప్పారని వారు అన్నారు. ఈ విషయంలో మాకు కానీ మా కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి వివాదం కనిపించడం లేదు.


మీడియాలో ఈ విషయాన్ని ఇంకా ఇంకా డ్రాగ్ చేయొద్దు ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని అందరు అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం అంటూ ఎస్వీ రంగారావు మనవళ్లు కోరారు. ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీ రంగారావు, మరో మనవడు  ఎస్వీఎల్ఎస్ రంగారావు(బాబాజీ) కోరారు.
Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?


Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook