Swara Bhaskar Troll బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమెపై యాంటీ బీజేపి అనే ముద్ర ఉంటుంది. ప్రతీ సందర్భంలో బీజేపీని విమర్శించడం, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై స్వర భాస్కర్ నెగెటివ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఘటనపై స్వర భాస్కర్ ఎంతగా హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు స్వర భాస్కర్ మళ్లీ యూపీ సర్కారు మీద మండిపడుతూ ట్వీట్ వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిఖ్ అహ్మద్‌పై పోలీసులు, మీడియా ఎదుటే దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా యూపీ ప్రభుత్వం చేసిన పనే అని అంతా అనుకుంటున్నారు. అతిఖ్ హతం అవ్వడంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. రాక్షసుడు అంతం అయ్యాడని సంబరపడుతున్నారు. యోగిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యోగియే తమ భరోసా అని అనుకుంటున్నారు.


 



అయితే కొంత మంది మాత్రం అతిఖ్ హతమైన తీరు మీద మండి పడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, అంత దారుణంగా కాల్చి చంపుతుంటే.. పోలీసులేం చేస్తున్నారని, ఇలా ఎందుకు ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. మీడియా, జర్నలిస్టుల ముసుగులో వచ్చిన దుండగుడు.. అలా కాల్పులకు ఎందుకు పాల్పడ్డారని నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ కూడా ప్రశ్నించింది.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


చట్టం, న్యాయానికి అతీతంగా ఓ ఎన్ కౌంటర్ జరగడం, ఓ మనిషిని చంపడం అనే దాన్ని సెలెబ్రేట్ చేయకూడదు.. అలా జరిగిందంటే.. ఆ రాష్ట్రంలో చట్టాలు, న్యాయాలు లేవని అర్థం.. వాటి మీద జనాలకు నమ్మకం పోయినట్టు.. అలాంటిది బలమైన ప్రభుత్వం అనిపించుకోదు.. అది నియంతృత్వ ధోరణి అనిపించుకుంటుందంటూ ట్వీట్ వేసింది. దీంతో స్వర భాస్కర్ మీద నెటిజన్లు మండి పడుతున్నారు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook