Swara Bhaskar: కరోనాతో నేను చనిపోతే.. మీ కుటుంబాలను ఎలా పోషిస్తారు! హీరోయిన్ సంచనల వ్యాఖ్యలు!!
ప్రముఖులకు కరోనా వస్తే సపోర్ట్ నిలిచే ఫాన్స్, నెటిజన్లు.. స్వరా భాస్కర్‌ను మాత్రం త్వరగా చచ్చిపో అని అనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
Swara Bhaskar slams trolls wanting her to die amid COVID-19: బాలీవుడ్ (Bollywod) హీరోయిన్ 'స్వరా భాస్కర్' (Swara Bhaskar) గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. నిజం చెప్పాలంటే.. స్వరా భాస్కర్ ఎక్కడుంటే వివాదం అక్కడ ఉన్నట్టే. ఒక్కోసారి సానుకూలంగా స్పందించినా.. చాలాసార్లు ఆమె వివాస్పద వ్యాఖ్యలే చేశారు. గతంలో నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వంపై స్వరా చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వరా తాజాగా కరోనా వైరస్ (Covid 19) బారిన పడ్డారు.
తనకు కరోనా వచిన్నట్టు స్వరా భాస్కర్ (Swara Bhaskar Covid 19) శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాం. ఇటీవల నన్ను కలిసిన వారు అందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. దయచేసి అందరు మాస్క్ ధరించండి. కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండండి' అని స్వరా భాస్కర్ ట్వీట్ (Swara Bhaskar Tweet) చేశారు. దీంతో ఆమెను అభిమానించే వాళ్లు త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతుంటే.. ద్వేషించే వాళ్లు మాత్రం త్వరగా చచ్చిపో అంటూ దారుణంగా పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: BREAKING: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
ప్రముఖులకు కరోనా వస్తే సపోర్ట్ నిలిచే ఫాన్స్, నెటిజన్లు (Netizens).. స్వరా భాస్కర్‌ను మాత్రం త్వరగా చచ్చిపో అని అనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. 'అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్' అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. 'త్వరగా చచ్చిపో.. నీలాంటి వాళ్లకి నరకంలో కూడా ప్లేస్ ఉండదు' అంటూ మరికొంతమంది అసభ్యకర కామెంట్లను పెడుతూ స్వరాని సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న దారుణమైన కామెంట్లపై బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. 'నేను చనిపోతే.. మీరందరు ఎలా బ్రతుకుతారు. మీ బ్రతుకుతెరువు నన్ను ట్రోల్ చేయడమే కదా?.. మీ కుటుంబాలను ఎలా పోషిస్తారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. నేను బతకాలని కోరుకోండి' అంటూ స్ట్రాంగ్ సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయింది.
Also Read: Warner - Kohli: వైఫల్యాలు సహజమే.. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి