Counter to Dil Raju: దిల్ రాజు వేలితో ఆయన కంట్లోనే పొడిచిన నిర్మాత.. పాపం ఏం చేస్తారో?
Prasanna Kumar Strong Counter to Dil Raju: పేట సినిమా విషయంలో తనకు థియేటర్లు దక్కకుండా చేసి ఇబ్బంది పెట్టిన దిల్ రాజుకు నిర్మాత ప్రసన్న కుమార్ ఇప్పుడు వారిసు సినిమా రిలీజ్ విషయంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
T Prasanna Kumar Strong Counter to Dil Raju: సినీ నిర్మాత దిల్ రాజు గతంలో మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పి తీసుకొచ్చాయి. 2019వ సంవత్సరంలో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఎఫ్2 అనే సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా అదే సమయంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా సినిమా కూడా విడుదలకు సిద్దమవగా దాన్ని తెలుగులో పేట అనే పేరుతో రిలీజ్ చేశారు. అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ, బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో దిల్ రాజు తన అధీనంలో ఉన్న థియేటర్లన్నింటిలో ఎఫ్2 ప్రదర్శించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు.
ఆ మేరకు సఫలమయ్యారు కూడా. అయితే అప్పట్లో పెట్టా సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రసన్నకుమార్ ఆ పెట్టా సినిమాకి థియేటర్లు దక్కించుకునేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ దిల్ రాజు ఖరాఖండిగా తెలుగులో పెద్ద ఎత్తున సినిమాలో ఉన్నప్పుడు వేరే భాష సినిమాకి ఎలా ధియేటర్లు దొరుకుతాయని ప్రశ్నించడమే కాలేదు మీడియా వేదికగా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇక ఆ తర్వాత 2021 లో క్రాక్ సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా హక్కులను దిల్ రాజు దక్కించుకోలేకపోయారు. వరంగల్ శీను అనే వ్యక్తి ఆ సినిమా హక్కులు దక్కించుకుని తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ చేశాడు. అయితే ఆ సంవత్సరానికి గాను విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా దక్కించుకున్న దిల్ రాజు తన మాస్టర్ సినిమాకి ఎక్కువ ధియేటర్లు దక్కించుకునే ప్రయత్నం చేశారు.
అప్పట్లోనే ఈ లాజిక్ తెర మీదకు వచ్చింది. అప్పుడు డబ్బింగ్ సినిమాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించారు మరి ఇప్పుడు డబ్బింగ్ సినిమా కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విషయం మీద దిల్ రాజు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి దిల్ రాజు వారసుడు అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ హీరోగా తెరకెక్కించారు. ముందుగా దీన్ని బై లింగ్యువల్ అన్నారు కానీ తరువాత అనేక కారణాలతో తమిళ సినిమా అని అంటున్నారు. దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతున్నాయి.
అలాగే ప్రభాస్ ఆదిపురుష సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ వాయిదా వేశారు. ఇక అఖిల్ ఏజెంట్ సినిమాని కూడా సంక్రాంతి సీజన్ లోని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ అది రిలీజ్ అవుతుందో లేదో అనే దానిపై క్లారిటీ లేదు. సరిగ్గా అదే సమయంలో వారసుడు సినిమాని కూడా దిల్ రాజు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అప్పట్లో పేట ప్రొడ్యూసర్స్ లో ఒకరు ప్రస్తుతం తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ అయిన టీ ప్రసన్నకుమార్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అదేమిటంటే తెలుగులో తెలుగు డైరెక్ట్ సినిమాలు విడుదలవుతున్న సమయంలో ఇతర భాషల సినిమాలకు థియేటర్లు ఇవ్వడం కరెక్ట్ కాదని 2019లో దిల్ రాజు గారు చెప్పిన ప్రకారమే ఆయన మాటలు మేరకు తెలుగు సినిమాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లకు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు దిల్ రాజుకు భలే కౌంటర్ పడిందిగా ఆయన వేలితో ఆయన కంటినే పొడిచారు అన్నట్లుగా నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం మీద దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది.
Also Read: Five Heorines in Yashoda: సమంత సహా 'యశోద'లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా?
Also Read: Daggubati Family: ఎమ్మెల్యేలకు ఎర కేసులో చిక్కుకున్న వ్యక్తికీ దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య లావాదేవీలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook