Mithali raj Biopic:  క్రికెటర్‌ ‘మిథాలీరాజ్‌’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'శభాష్ మిథు'(Shabaash Mithu Movie). తాప్సీ(Taapsee pannu) లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మిథాలీ పుట్టినరోజు(డిసెంబర్‌3) సందర్భంగా నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌(Biopic)ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారుల బయోపిక్స్ సందడి చేశాయి. కాసుల వర్షం కూడా కురిపించాయి. ధోని, మేరీకోమ్, మిల్కాసింగ్ బయోపిక్స్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టాయి. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌లో ‘లేడీ సచిన్’ అని గుర్తింపు పొందిన హైదరాబాదీ క్రికెటర్‌ ‘మిథాలీరాజ్‌’ జీవిత కథ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించనుంది. బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన తాప్సీ పన్ను టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.


Also Read:Deepika Padukone Prabhas Movie : ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో వాలిపోయిన దీపికా పదుకొణె


 కరోనా(Covid-19) కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook