Tabassum Govil Death News: బాలీవుడ్ నుంచి మరో బాధాకరమైన వార్త బయటకు వచ్చింది, దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ నటి, తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. పూర్తి సమాచారం ప్రకారం, 78 ఏళ్ల తబస్సుమ్ గుండెపోటు కారణంగా మరణించారు. నిన్న సాయంత్రం అంటే శుక్రవారమే ఆమె మరణించినా అందుకు సంబంధించిన సమాచారం ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఆమె నటిగా అనేక సినిమాల్లో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ అనే టాక్ షోతో ఆమె హోస్ట్ కూడా మారి అనేక సంవత్సరాల పాటు సేవలు అందించింది.  ఈ చాట్ షోలో ఆమె అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో మాట్లాడేది. ఒకరకంగా నటిగా కంటే ఆమెకు ఈ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో దూరదర్శన్‌లో ఒకట్రెండు కాదు 21 ఏళ్ల పాటు ప్రసారం అయింది. ఈ షో 1972లో ప్రారంభమై 1993 వరకు కొనసాగింది. ఇక తబస్సుమ్ రామాయణంలో రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ సోదరుడు విజయ్ గోవిల్‌ను వివాహం చేసుకున్నారు.


ఇక తబస్సుమ్, విజయ్ దంపతులకు హోషాంగ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెకు నిన్న అంటే శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చిందని, దాని కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని అంటున్నారు. తబస్సుమ్ 1947 సంవత్సరంలో 'మేరా సుహాగ్' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది, ఆ తర్వాత ఆమె అనేక సినిమాలు మరియు టీవీ షోలలో భాగమైందని అంటున్నారు.


నిజానికి ఆమెకు ఉదయం 8:40 గంటలకు మొదటి సారి గుండెపోటు వచ్చిందని, 8:42 గంటలకు రెండోసారి గుండెపోటు వచ్చిందని, దాని కారణంగా ఆమె మరణించారని అంటున్నారు. ఇక ఆమె అంత్యక్రియలు ఈ రోజు ముంబైలో జరిగాయి. ఇక ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ, ఆమెను ఖననం చేసే ముందు ఆమె మరణం గురించి ఎవరికీ చెప్పకూడదని తన తల్లి కోరిక అని అందుకే ఆమె మరణం గురించి మీడియాకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. 
Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!


Also Read: Bigg Boss 6 Telugu: మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం ఆ కంటెస్టెంట్ బలి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook