Bigg Boss 6 Telugu: మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం ఆ కంటెస్టెంట్ బలి?

Marina Evicted From Bigg Boss House: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇది కూడా కాస్త షాకింగ్ గానే ఉంది. ఆ వివరాలు 

Last Updated : Nov 19, 2022, 05:14 PM IST
Bigg Boss 6 Telugu: మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం ఆ కంటెస్టెంట్ బలి?

Marina Evicted From Bigg Boss 6 Telugu House: బిగ్ బాస్ తెలుగు సిక్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెడితే ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మొదటి వారంలో షానీ సాల్మన్, అభినయ శ్రీ ఎలిమినేట్ అవ్వగా మూడవ వారంలో నేహా చౌదరి, నాలుగో వారంలో ఆరోహి, ఐదవ వారంలో చలాకీ చంటి, ఆరో వారంలో సుదీప, ఏడవ వారంలో అర్జున్, ఎనిమిదవ వారంలో ఆర్జే సూర్య, తొమ్మిదవ వారంలో గీతూ రాయల్, పదో వారంలో బాలాదిత్య, వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 11వ వారానికి ఎలిమినేషన్ కోసం హౌస్ లో మిగిలిన 10 మంది సభ్యులలో 8 మంది నామినేట్ అయ్యారు.

హౌస్ లో ఫైమా కెప్టెన్ గా ఉన్న కారణంగా ఆమె నామినేట్ అవ్వలేదు అలాగే రాజశేఖర్ కి ఇమ్యూనిటీ దొరకడంతో అతను కూడా ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకున్నాడు. ఫైమా, రాజశేఖర్ మినహా రోహిత్, మెరీనా, ఇనయ సుల్తానా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీ సత్య, శ్రీహాన్, రేవంత్ ఇలా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. శనివారం నాడే ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా షూటింగ్ జరుపుతారు. దీంతో శుక్రవారం రాత్రి వరకే ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేస్తారు. ఇక ఈ ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే మొదటి స్థానంలో రేవంత్ నిలవగా రెండవ స్థానంలో ఇనయా సుల్తానా ఉందని ఆ తర్వాత కీర్తి, ఆదిరెడ్డి ఉండగా ఐదవ స్థానంలో శ్రీహాన్ ఆరవ స్థానంలో రోహిత్ ఉన్నారని అంటున్నారు.

ఏడవ స్థానంలో శ్రీ సత్య ఎనిమిదో స్థానంలో మెరీనా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా చూసుకుంటే రోహిత్, శ్రీ సత్య, మెరీనా డేంజర్ జోన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సీజన్ లో ఇంకా ఫ్యామిలీ ఎపిసోడ్ షూటింగ్ జరగలేదు. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీ సత్యను ఖచ్చితంగా హౌస్ లో ఉంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భార్యాభర్తలైన రోహిత్, మెరీనా ఇద్దరిలో ఎవరో ఒకరిని బయటకు పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెరీనాతో పోల్చుకుంటే రోహిత్ ఆట కాస్త మెరుగ్గా ఉండడంతో అతనిని హౌస్ లో ఉంచేందుకు బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వారం హౌస్ నుంచి మెరీనా బయటకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముందు నుంచి కూడా మెరీనా ఆట తీరు అంత అత్యద్భుతంగా ఏమీ లేదు. కాకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే ఆమె కాస్త బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది కానీ ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం ఆమెకు ఓట్లు బాగా తక్కువ పడడంతో ఆమెను సాగనంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తయిందని ఆమెను ఇంటికీ పంపేశారని అంటున్నారు. ఇక  శ్రీ సత్య తల్లి కేవలం వీల్ చైర్ కే పరిమితం అయి ఉంటారు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా ఆమెను హౌస్ లోకి తీసుకొస్తే సింపతి వర్కౌట్ అయ్యి టిఆర్పి రేటింగులు బాగా రావచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను లోపలికి తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: Support to Dil Raju: దిల్ రాజుకు అండగా తమిళ నిర్మాతలు... 'వారసుడు'ను టచ్ చేస్తే, తెలుగు సినిమాలు ఆడనివ్వం?

Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x