Tamannaah in WFH mode: తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్
Tamannaah in work from home: కరోనావైరస్ వ్యాప్తికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లేదా ఇంకొన్ని రంగాలకు చెందిన వారికి మాత్రమే సంబంధించిన విషయంగా ఉండేది.
Tamannaah in work from home: కరోనావైరస్ వ్యాప్తికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లేదా ఇంకొన్ని రంగాలకు చెందిన వారికి మాత్రమే సంబంధించిన విషయంగా ఉండేది. కానీ కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ( Work from home ) అనేది దాదాపు వీలైనంత ఎక్కువ రంగాలకు వ్యాపించింది. ఓవైపు లాక్ డౌన్.. మరోవైపు సోషల్ డిస్టన్సింగ్ లాంటి కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 guidelines ) అమలులో ఉండటంతో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమయ్యారు. సినీరంగం కూడా అందుకు అతీతమేమీ కాదు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ నిలిచిపోవడంతో సినిమా వాళ్లు కూడా ఆ గ్యాప్‌లో ఖాళీగా ఉండకుండా ఇంటి దగ్గర నుంచే వీలైనన్ని పనులు పూర్తి చేసుకున్నారు. Also read : Renu Desai direction: తెలుగు సినిమా డైరెక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన రేణు దేశాయ్
మిల్కి బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah Bhatia ) కూడా అలాగే ఇంటి దగ్గర ఉంటూనే ఆన్‌లైన్ ద్వారా స్క్రిప్టులు వినడం, ప్రస్తుతానికి సైన్ చేసిన సినిమాలకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలతో టచ్‌లో ఉంటూ ఆయా చిత్రాలకు అవసరమైన కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి పనులు చేసిందట. Also read : Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోను షేర్ చేసుకున్న తమన్నా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చివరి రోజులు అంటూ క్యాప్షన్ రాసింది. కరోనావైరస్ మనల్ని ఇంకా పూర్తిగా విడిచిపెట్టనప్పటికీ.. అవసరమైన అన్ని నివారణ చర్యలు ( COVID-19 precautions ) తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా షూటింగ్స్‌కి హాజరుకాక తప్పదని తమన్నా తన పోస్టులో పేర్కొంది. Also read : Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే...
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..
- Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్
- Chiranjeevi: మెగాస్టార్ గుండు లుక్ సిక్రెట్ ఇదే..
- Bigg Boss Telugu 4: రెండో వారం నామినేషన్లో గంగవ్వ సహా 9 మంది సభ్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR