Tamil Actor Vivek: తమిళ కమేడియన్ వివేక్ (Kollywood Comedian Vivek) ​ మృతికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి స్పష్టం చేసింది. గుండెపోటు వల్లే ఆయన మరణించినట్లు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) కారణంగానే వివేక్​ ప్రాణాలు కోల్పోయారన్న వాదనలో నిజం లేదని తేల్చి చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఈ వివాదం ఎందుకొచ్చింది?


తీవ్ర అనారోగ్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్​ 16న వివేక్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతుండగా.. మరుసటి రోజు (ఏప్రిల్ 17న) గుండె పోటు రావడంతో వివేక్ మృతి చెందారు.


అయితే వివేక్ మృతికి రెండు రోజుల ముందే కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. దీనితో వ్యాక్సిన్​ కారణంగానే ఆయన చనిపోయారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. గుండె పోటుకు వ్యాక్సిన్​కు సంబంధం లేదని.. ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు. అయినా.. వ్యాక్సిన్​ వల్లే వివేక్ ప్రాణాలు కోల్పోయారంటూ పలువురు ఆందోళన చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన వైద్య శాఖ అధికారులు వివేక్ మృతికి వ్యాక్సిన్ కారణం కాదని నిర్ధారణకు వచ్చారు. వివేక్​కు గుండె పోటు రావడం యాదృచ్ఛికంగా జరిగినట్లు అభిప్రాయపడ్డారు.


Also read: Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్


వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వివేక్ ఏమన్నారంటే..


వ్యాక్సిన్ వేసుకోవాడానికి చాలా మంది వెనకడుకు వేస్తున్న సమయంలోనే.. చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్​పై జనాల్లో ఉన్న అపోహలు తొలగించేందుకే తాను ప్రభత్వ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నట్లు వివేక్ చెప్పుకొచ్చారు. సరిగ్గా టీకా తీసుకున్న రెండు రోజులకు.. 59 ఏళ్ల వయసులో వివేక్ మృతి చెందారు.


వివేక్‌ కొడుకు ప్రసన్నకుమార్‌ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అనారోగ్యం కారణంగా వివేక్‌ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్‌ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు అప్పట్లో గుర్తు చేసుకున్నారు.


Also read: Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..?? ఎంత వరకు నిజం?


వివేక్ సినీ ప్రస్థానం..


తమిళ సినిమాలో హాస్య నటుల గురించి చర్చ వస్తే అందులో వివేక్ ప్రస్థానం కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అంతగా తమిళ సినిమాలో ఆయన నటన, కామెడీతో మెప్పించారు. 1980లలో చదువుకుంటూనే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన వివేక్.. 1987 తర్వాత బిజీ యాక్టర్​గా మారిపోయారు.


తమిళంతో పాటు.. తెలుగు ప్రేక్షకులు ఎంతో సుపరిచితులు బాయ్స్, అపరిచితుడు, రఘువరన్ బీటెక్, సింగం, శివాజీ సినిమాల్లో కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తిండిపోతుంది.


దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయనకు 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో(Padmasree award)సత్కరించింది.


Also read: Natyam movie: ‘నాట్యం’ చిత్ర బృందానికి వెంకయ్యనాయుడు, బాలకృష్ణల అభినందలు


Also read: Varun Tej Ghani Movie: 'గని' ఫస్ట్​ సింగిల్​ రిలీజ్​ అప్​డేట్​.. ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook