Manobala Passed Away తమిళ హాస్య నటుడు మనోబాలా (69) కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే మరణించారు. లివర్ సమస్యలతో ఆయన తుది శ్వాసవిడిచినట్టు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే మనోబాల గురించి ఇలాంటి వార్త వినడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాల్లో నవ్వులు పూయించిన ఆయన ఇప్పుడు అందరినీ కన్నీళ్లలో ముంచెత్తారని అభిమానులు బాధపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళంలో మనోబాల ఎంత ఫేమస్సో తెలుగులోనూ అంతే ఫేమస్. డబ్బింగ్ సినిమాలతో ఆయన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మనోబాలా కచ్చితంగా ఉంటాడు. విజయ్, రజినీ ఇలా అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు.


మనోబాల ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆయన చేసిన చిన్న తప్పుకు విజయ్ లోకేష్ కనకరాజ్ సినిమాను అనధికారికంగా అధికారిక ప్రకటన ఇచ్చినట్టు అయింది. లోకేష్ కనకరాజ్ విజయ్ కలిసి సినిమా చేస్తున్నారని, ఆ సినిమా సెట్‌లో నేను అడుగు పెట్టాను అంటూ మనోబాల వేసిన ట్వీట్‌తో అధికారికంగా ప్రకటించినట్టు అయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ చిత్రయూనిట్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయినట్టుంది.


Also Read:  Malavika Mohanan : ఆ పార్ట్ మీదే ఫోకస్.. అద్దం ముందు మాళవిక అందాల ప్రదర్శన


మనోబాల తాను చేసిన తప్పును తెలుసుకుని.. వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. తాను తెలియక అలా చేశానంటూ మనోబాల మళ్లీ క్లారిటీ ఇచ్చాడు. అలా మనోబాల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలోనే ఇలా ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.


Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook