Tamil movies: ఈ తమిళ చిత్రాల కథలే ఇప్పుడు నిజమవుతున్నాయా ?
కరోనావైరస్ కాలం ( Corona crisis ) అన్నింటినీ మార్చేసింది. సినిమాను కూడా... ఇకపై సినిమాను సినిమాగా మాత్రమే కాకుండా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్‌లానూ చూడొచ్చేమో!!. మనం ఇప్పుడిలా చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. కొన్ని తమిళ సినిమాలు ముందు కల్పితాలుగా తెరకెక్కినా... తరువాత కాలంలో అందులో ప్రస్తావించాల్సిన అంశాలే ఏదో ఓ రూపంలో నిజ జీవితంలో దర్శనమిస్తున్నాయి ( Tamil movies predicting future ) .
కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus pandemic ) అన్నింటినీ మార్చేసింది. సినిమాను కూడా... ఇకపై సినిమాను సినిమాగా మాత్రమే కాకుండా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్‌లానూ చూడొచ్చేమో!!. మనం ఇప్పుడిలా చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. కొన్ని తమిళ సినిమాలు ముందు కల్పితాలుగా తెరకెక్కినా... తరువాత కాలంలో అందులో ప్రస్తావించాల్సిన అంశాలే ఏదో ఓ రూపంలో నిజ జీవితంలో దర్శనమిస్తున్నాయి ( Tamil movies predicting future ) . ఇందులో సూర్య ( Actor Suriya ) నటించిన సినిమాలే ఎక్కువగా ఉండటం మరో విశేషం. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సినిమాల కథాకమామిషు చూశాకా తరువాత మీరే అంటారు సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. భవిష్యత్ కాలానికి తీసుకెళ్లే టైమ్ మెషీన్ కూడా అని.
బిచ్చగాడు మూవీ : 2016లో మన ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. తమిళంలో పిచ్చైకరన్ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బిచ్చగాడు అనే టైటిల్‌తో రిలీజైంది. శశి అనే తమిళ దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఒకానొక సన్నివేశంలో ఇండియాలో బ్లాక్ మనీనీ ఎలా నిర్మూలించాలనే అంశంపై ఓ బిచ్చగాడు ఓ రేడియో జాకీకి ఫోన్ చేసి మాట్లాడతాడు. బిచ్చగాడే అయినప్పటికీ.. ఓ ఆర్థిక నిపుణుడిలా సలహా ఇచ్చి వివరంగా వివరిస్తాడు. సీన్ కట్ చేస్తే.. అదే ఏడాది చివర్లో దేశవ్యాప్తంగా పెద్ద పాత నోట్ల రద్దు ( Demonetization ) అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
7Th సెన్స్ మూవీలో చైనా నుంచి వచ్చిన వైరస్ ( 7Th Sense movie )
దీన్ని సినిమాకాదు.. నడుస్తున్న చరిత్ర అనవచ్చు. ఎందుకంటే ఈ మూవీ కథకు నేడు కరోనా మిగిల్చిన వ్యధకు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో భారత్‌పై చైనా బయోలాజికల్ వెపన్ వాడుతుంది. వీది కుక్కలకు వైరస్ సోకేలా చేసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది.
దీన్ని పసిగట్టిన కొంత మంది జెనెటిక్ స్టూడెంట్స్ దీనికి విరుగుడుగా బోధి ధర్మ వారసుడి కోసం వెతుకుతుంటారు. 5వ దశాబ్దంలో చైనాలో ప్రభలిన ఒక అంటువ్యాధిని అక్కడే కట్టడి చేయడానికి బోధి ధర్మ చైనాకు వెళ్తాడు. ఆయన వారసుడి సహాయంతో ఈ వైరస్‌కు చెక్ పెట్టవచ్చనేది ఈ జెనెటిక్ స్టూడెంట్స్ ఆలోచన.. ప్రయత్నం. అది సినిమా కాబట్టి కథ సుఖాంతం అయింది. కానీ ప్రస్తుతం కరోనా మాత్రం మనుషులను సుఖంగా ఉండనివ్వడం లేదు.
ఈ సినిమాలో అనేక సన్నివేశాలు సార్స్ వ్యాధి సమయంలో వచ్చిన వీడియోలు, ఫోటోలను, కరోనా కాలంలో వెల్లడైన విషయాలతో పోలి ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ఏఆర్ మురగదాస్ సెన్స్‌ను ప్రశంసించాల్సిందే.
బందోబస్త్ మూవీలో మిడతల దండు, కావేరీ డెల్టా వివాదం అంశాలు ( Bandobast movie )
సూర్య, మోహన్ లాల్ నటించిన బందోబస్ట్ అనే మూవీ ఇటీవలే విడుదలైంది. కానీ ఈ సినిమా కథ నేడు మనం ఉన్న పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. ఇందులో కావేరి డెల్టాను ప్రత్యేక వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తాడు సినిమాలో ప్రధానమంత్రి. తరువాత కాలంలో అదే నిర్ణయం తమిళనాడు ప్రభుత్వం తీసుకోవడంతో చాలా మంది షాక్ అయ్యారు.
ఇటీవలే ఆఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన మిడతల దండు రైతాంగాన్ని ఏ విధంగా కలవరపెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కూడా కొంత మంది ల్యాబ్‌లో క్రియేట్ చేసిన భయంకరమైన మిడతల దండును బయటికి వదులుతారు. దాని తరువాత జరిగిన పరిణామాలు నేటి పరిణామాలతో పోలినట్టుగా ఉంటాయి.
బ్రదర్స్ ( Maattran movie )
సూర్య డబుల్ రోల్‌లో… తమిళంలో వచ్చిన సినిమా మాట్రాన్. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ టైటిల్ బ్రదర్స్. సూర్య అవిభక్త కవలల పాత్రలో నటించిన బ్రదర్స్ సినిమా విషయానికొస్తే.. పేరు మోసిన ఒక శాస్త్రవేత్త విఫల ప్రయోగం ఏ విధంగా రెండు మనుసులు ఉన్న రెండు అవిభక్త కవలలు జన్మించడానికి కారణం అవుతుందనేదే ఈ సినిమా కథాంశం. యాదృశ్చికంగా ఈ సినిమా కథ కూడా నిజమైంది.
ఈ బ్రదర్స్ మూవీ 2012లో విడుదలైంది. కానీ 2019లో అటువంటి సీనే కళ్లముందు మెదలడం చూసి ప్రపంచం విస్తుపోయింది. ఎందుకంటే ఇదే సంవత్సరం చైనాకు చెందిన హీ జియాంకు (He Jiankui ) ప్రపంచంలోనే తొలి సారిగా (చట్ట విరుద్ధంగా ) జీన్స్‌ను ఎడిట్ చేసే పునరుత్పత్తి విధానంతో ట్యాంపర్ చేసి ఇలాగే అవిభక్త కవల అమ్మాయిలు జన్మించడానికి కారణం అయ్యాడు. ఇలాంటి కథాంశాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి సినిమాలను చూశాకా.. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న, జరిగిన అనేక పరిణామాలు తమిళ సినిమాల కథాంశాలకు దగ్గరిగా ఉండటం ఆసక్తినిరేకెత్తిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..