Tamil Nadu health minister reacts on Nayanthara surrogacy controversy: నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. గతంలో పలువురు తమిళ హీరోలతో ప్రేమాయణం నడిపిన ఈమె దాదాపుగా పెళ్లి పీటల వరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా పూర్తికాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు ఈ జంట. నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.


ఈ విషయాన్ని ఇప్పటివరకు నయనతార కానీ విగ్నేష్ శివన్ కానీ  అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది జనవరి నెలలో సరోగసిని భారతదేశంలో బ్యాన్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనేందుకు అనుమతులు ఇస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల నయనతార సరోగసీ ద్వారా బిడ్డలు కనడానికి అర్హురాలు కాదని చెబుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో ఈ విషయం మీద తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు.


నయనతార సరోగసీ వివాదంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య మంత్రి.. సరోగసీ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనేదానిపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తుందని పేర్కొన్నారు. అలాగే నయనతార కూడా సరోగసిపై వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్‌ కోరారు. పిల్లలను కనడం కుదరదని కొన్ని ప్రత్యేక పరిమితులతోనే ఈ అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “21 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఎగ్ దానం చేయడానికి అర్హులని, పెళ్లయిన తర్వాత భర్త అంగీకారంతోనే దానం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ఇక నయనతార నిబంధనలను పాటించి సర్రోగేట్ ద్వారా బిడ్డను కన్నట్లయితే వైద్య కళాశాల డైరెక్టరేట్‌ వివరణ కోరినప్పుడు సరైన పత్రాలు సమర్పించాలని, త్వరలో నయనతారపై విచారణ జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయం మీద నయనతార దంపతులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.


Also Read: Samantha Divorce Reason: చైతూ టార్చర్ తట్టుకోలేకే విడాకులు.. ఎట్టకేలకు నోరు విప్పిన సమంత?


Also Read: Karan Johar Good Bye: ట్విట్టర్ కు కరణ్ జోహార్ గుడ్ బై.. అందుకే అంటూ క్లారిటీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook