Karan Johar Quits Twitter: ట్విట్టర్ కు కరణ్ జోహార్ గుడ్ బై.. అందుకే అంటూ క్లారిటీ!

Karan Johar Says Good Bye to Twitter: ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో నెగటివిటీ ఎదుర్కొంటూ ఉండే కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 10, 2022, 05:59 PM IST
 Karan Johar Quits Twitter: ట్విట్టర్ కు కరణ్ జోహార్ గుడ్ బై.. అందుకే అంటూ క్లారిటీ!

Karan Johar Says Good Bye to Twitter: బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కరణ్ జోహార్ తర్వాత కుచ్ కుచ్ హోతా హై అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఈ మధ్య కాలంలో మాత్రం పూర్తిగా నిర్మాణ రంగం మీదే ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఎక్కువగా వారసుల పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎక్కువగా కరణ్ జోహార్ ను టార్గెట్ చేశారు సుశాంత్ రాజపుత్ అభిమానులు. ఒకరకంగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా దాన్ని బాయికాట్ చేయాలనే ట్రెండ్ ఎక్కువగా వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన లైగర్ సినిమాకి కూడా కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా హిందీలో పెద్ద ఎత్తున విడుదల కావడానికి కూడా ఆయనే కారణమయ్యారు. అప్పుడు ఆయన వల్ల ఈ సినిమాను కూడా బే కాట్ చేయాలనే అయితే కరణ్ జోహార్ గురించి ఎప్పటికప్పుడు రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన గే అని పలువురు హీరోలతో రిలేషన్ లో ఉన్నాడని ఇలా రకరకాల ప్రచారాలు మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో చెబుతూ ఉండే కరన్ జోహార్ తాజాగా ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్టు ర్కొన్నారు.

‘’మరింత పాజిటివ్ వైబ్స్  కోసం ట్విట్టర్ కు వీడ్కోలు చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ పైన కూడా నెటిజన్లు పాలు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. కరణ్ జోహార్ ఇలా ట్విట్టర్ దూరం అవడం కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం ఉండి మాత్రం ఏం చేస్తాడు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. 

Also Read: Samantha Divorce Reason: చైతూ టార్చర్ తట్టుకోలేకే విడాకులు.. ఎట్టకేలకు నోరు విప్పిన సమంత?

Also Read: MS Dhoni into film industry: సినీ ఇండస్ట్రీలోకి ధోని ఎంట్రీ.. ఆ సినిమాలతో బడా ప్లాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News